వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. 2019 లో వచ్చిన ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు నిర్మించారు. సోనాల్ చౌహాన్ ,మురళీ శర్మ, సునీల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో మొదటినుండీ ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక మే 27న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్లను సాధించింది. ‘ఎఫ్3’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం
12.05 cr
సీడెడ్
3.53 cr
ఉత్తరాంధ్ర
3.36 cr
ఈస్ట్
1.80 cr
వెస్ట్
1.56 cr
గుంటూరు
2.04 cr
కృష్ణా
1.75 cr
నెల్లూరు
1.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
27.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.80 cr
ఓవర్సీస్
5.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
34.25 cr
‘ఎఫ్3’ మూవీకి రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.34.25 కోట్ల షేర్ ను రాబట్టింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.29.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సోమవారం బుకింగ్స్ కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. వీక్ డేస్ లో స్టడీ గా రాణిస్తే ఈ మూవీ గట్టెక్కినట్టే..!