F3 Movie: ఎఫ్ 3 నుంచి అదిరిపోయే స్పెషల్ సాంగ్..!

విక్టరీ వెంకటేష్ మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన కామెడీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. F2 సినిమాకు ఫ్రాంచైజ్ గా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కూడా ఇటీవల స్టార్ట్ చేయడం జరిగింది.

Click Here To Watch NOW

ఈ సినిమాలోని ఒక స్పెషల్ పాటను కొద్దిసేపటి క్రితం విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఊ ఆ అహ అహ.. అంటూ వెంకటేష్ వరుణ్ తేజ్ ఇద్దరు కూడా గ్లామరస్ హీరోయిన్స్ తో డిఫరెంట్ స్టెప్పులు తో అదరగొట్టిన ట్లుగా తెలుస్తోంది. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ తనదైన శైలిలో ఫాస్ట్ బీట్ కంపోజింగ్ చేసి మరింత అందాన్ని తీసుకొచ్చారు. తమన్నా మెహ్రీన్ ఫిర్జాదా సోనాల్ చౌహాన్ ముగ్గురు కూడా వారి గ్లామరస్ లుక్ తో పాటలో హైలెట్గా నిలిచినట్లుగా తెలుస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలోని అన్ని పాటలను కూడా చాలా డిఫరెంట్గా కంపోజింగ్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో డబ్బు అనే పాయింట్ ను హైలెట్గా చూపించబోతున్నాడు. డబ్బు నుంచి వచ్చే ఫ్రస్టేషన్ ఎలా ఉంటుంది అనే అంశాన్ని తనదైన శైలిలో కామెడీ సినిమాకి ప్రజెంట్ చేయబోతున్నట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో సునీల్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా అలాగే మిగతా సినిమాల నుంచి పోటీ ఉండటంతో వాయిదా వేసుకోక తప్పలేదు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus