బిగ్ బాస్ షోలో శనివారం ఎపిసోడ్ కోసమే ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తారు. నాగార్జున హౌస్ మేట్స్ కి క్లాస్ పీకుతుంటే ఎంజాయ్ చేస్తారు. హౌస్ లో గీతుని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన నాగార్జున సుతిమెత్తగా క్లాస్ పీకారు. ఏదైనా హౌస్ లో సీక్రెట్ చెప్పమని అంటే, ఆదిరెడ్డి నాతో మాట్లాడకపోతుంటే దుప్పట్లో వెక్కి వెక్కి ఏడ్చానని చెప్పింది గీతు. ఇది పెద్ద సీక్రెట్టా అని అడిగిన నాగార్జున, హౌస్ లో రూడ్ గా మాట్లాడటం తగ్గించుకోమని చెప్పాడు. అలా మాట్లాడటం వల్ల నువ్వు చాలామందికి దూరమైపోతున్నావని అన్నాడు.
అలాగే, ఫైమా సంచాలక్ గా చేసిన డెసీషన్ ని మెచ్చుకున్నాడు. రేవంత్ అడిగిన దాంట్లో లాజిక్ లేదని తేల్చేశాడు. కానీ, ఫైమా బాస్కెట్ లో బాల్ ఎవరైనా పెట్టచ్చని ఉందని ఇది కూడా టాస్క్ లోల లూప్ అని చెప్పాడు. నువ్వు సంచాలక్ గా ఎలాగైతే లూప్స్ వెతికావో మిగతా హౌస్ మేట్స్ కూడా అలాగే లూప్ హోల్స్ వెతుకుతారని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు, పైమా చేసిన మిస్టేక్ ని క్లియర్ గా ఎక్స్ ప్లయిన్ చేశాడు. నీకు సపోర్ట్ రాలేదని ఎందుకు బాధపడ్డావ్ అన్నాడు.
అంతేకాదు, వేరే టాస్క్ లో నీ బదులు రేవంత్ ఆడాడు అని గుర్తు చేశాడు. దీనికి ఫైమా దగ్గర సమాధానం లేకుండా పోయింది. అసలు ఫైమాకి నాగార్జున చెప్పిన లాజిక్ సగమే అర్ధమైంది. రోహిత్ బాస్కెట్ లో సుదీప బాల్ ని లాక్కుని వేయడం ఫైమాకి నచ్చలేదు. దీనిపైన చాలాసేపు ఫ్రస్టేట్ అయ్యింది. ఇదే విషయాన్ని నాగార్జున వీకండ్ క్లియర్ గా ఫైమాకి అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. హౌస్ మేట్స్ పెర్ఫామన్స్ ని బట్టీ గుడ్, యావరేజ్, డెడ్ అని బ్యాటరీ లెవల్స్ చూపించాడు నాగార్జున.
ఇందులో హౌస్ మేట్స్ లో కొందరికి గుడ్ వచ్చింది. కానీ, పూర్తిగా ఆటలో గుడ్ ఇవ్వలేదు. కొన్ని విషయాల్లో యావరేజ్, డెడ్ కూడా ఇచ్చాడు నాగార్జున. శనివారం ఎపిసోడ్ లో ఆడియన్స్ ని పలకరిస్తూ శుక్రవారం ఏం జరిగిందో చూపించారు.ఇనయ క్రష్ ఎవరంటే తెగ సిగ్గుపడిపోయింది. సూర్య దగ్గరకి వెళ్లింది. దీంతో హౌస్ మేట్స్ అందరికీ విషయం క్లియర్ గా తెలిసింది. మరోవైపు అర్జున్ ని కసురుకుంది శ్రీసత్య. సెన్స్ లేని వాళ్లు అలాగే సెన్స్ లేకుండా ఆలోచిస్తారని అన్నది. దీనికి అర్జున్ ఫీల్ అయిపోయాడు.
శ్రీసత్య వచ్చి గట్టిగా అరిచింది. నీ దారి నీది, నా దారి నాది అని చెప్పింది. ఆ తర్వాత మళ్లీ వచ్చి సారీ చెప్పి కూల్ చేసింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు కాసేపు నవ్వుకున్నారు. ఎపిసోడ్ లో అందర్నీ పలకరించిన నాగార్జున ఒక్కొక్కరి గేమ్ గురించి ఎనలైజ్ చేశాడు. రోహిత్ ఈవారం చేసిన త్యాగాన్ని మెచ్చుకున్నారు. వాళ్ల నాన్నగారి వీడియో మెసజ్ ని చూపించారు. అలాగే, రేవంత్ కెప్టెన్ గా హౌస్ లో నిద్రపోవడాన్ని చూపించారు.దీంతో హౌస్ మేట్స్ మొత్తం నవ్వుకున్నారు. అలాగే, బాలాదిత్యకి గీతు టాస్క్ లో ఎలా మాట మార్చిందో చూపించారు.
సిగరెట్స్ మానేయాలని , లేదా ఇంట్లో చక్కెర మొత్తం ఇచ్చేయాలని మాత్రమే బిగ్ బాస్ చెప్పాడని బాలాదిత్యకి చూపించాడు. దీంతో గీతు నా మంచికోసమే చేసిందని ఆదిత్య అన్నాడు. తర్వాత రోహిత్ కోసం వాసంతీ హైయిర్ ని కట్ చేస్కోవడం ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది. ఇనయకి ఆట పక్కదారి పడుతోందని, ఆ దారి వదిలి ఆటలోకి రమ్మని హెచ్చరించాడు నాగార్జున. ఈవిషయంలో ఇనయకి కొద్దిగా స్ట్రాంగ్ గానే డోస్ పడింది. మొత్తానికి శనివారం హౌస్ మేట్స్ పెర్ఫామన్స్ ని చెప్తూ ఎపిసోడ్ లో శ్రీసత్యని సేవ్ చేసి ముగించాడు నాగార్జున. అదీ మేటర్.