Devara Movie: ఎన్టీఆర్ అభిమానులు ఆ వార్తల విషయంలో అలర్ట్ అవ్వాల్సిందేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు కాగా ఎంతోమంది దర్శకులకు తారక్ ఫేవరెట్ హీరోగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసిన దర్శకులు సైతం ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత కథల విషయంలో వేలు పెట్టడానికి తారక్ అస్సలు ఇష్టపడరు. అయితే దేవర మూవీ గురించి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమా (Devara Movie) షూట్ క్యాన్సిల్ అయిందని భారీ మొత్తంలో నష్టం వచ్చిందని వేర్వేరు వార్తలు వినిపిస్తుండగా దేవర సినిమాకు పని చేస్తున్న వాళ్లు మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు. కొరటాల శివ గత సినిమా ఆచార్య ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకోకపోవడంతో ఈ తరహా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ తరహా వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన దేవర సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా దండయాత్ర మామూలుగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రేయింబవళ్లు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా సక్సెస్ సాధించగా ఆ సినిమాను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. బన్నీ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రావాల్సి ఉంది. బన్నీ కొరటాల కాంబో మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాల్సి ఉంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus