Good Bad Ugly: బ్యాడ్‌.. అగ్లీ.. వరెస్ట్‌… థియేటర్‌లో కొట్టుకున్న ఫ్యాన్స్‌.. వీడియో వైరల్‌!

ఫ్యాన్స్‌ మధ్య గొడవలు అనేవి చాలా ఏళ్లుగా మన సినిమా పరిశ్రమలో కామన్‌. థియేటర్ల బయట, లోపల ఫ్యాన్స్‌ గొడవలు పడి కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు పరస్థితులు మారాయి. జనాలు థియేటర్లలో, రోడ్ల మీద కాకుండా సోషల్‌ మీడియాలో చూపిస్తున్నారు. దీంతో ఇక ఫిజికల్‌ గొడవలు దాదాపు ఇక లేవు అని అనుకుంటున్న సమయంలో ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly)  సినిమా థియేటర్‌లో ఫ్యాన్‌ వార్‌ జరిగింది.

Good Bad Ugly:

ఫ్యాన్‌ వార్‌ అనే కంటే ఒకరి మీద ఒకరు పడి కొట్టుకున్నారు అని చెప్పాలి. కోలీవుడ్‌లో అజిత్ (Ajith Kumar), విజయ్ (Vijay Thalapathy) అభిమానుల మధ్య గొడవలు చాలా కాలంగా ఉన్నాయి. గతంలో వీరి ఫ్యాన్స్ మధ్య పెద్ద పెద్ద వివాదాలే ఉన్నాయి. దీంతో అజిత్ తన అభిమానులతో సమావేశాలు రద్దు చేసుకున్నారు కూడా. అలాగే సినిమా ప్రమోషన్లకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. అయినా ఫ్యాన్స్ మధ్య గొడవలు ఆగడం లేదు. తాజాగా మరోసారి ఫ్యాన్స్ కొట్టుకున్నారు.

అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా థియేటర్‌లో ఇది జరిగింది. ఏమైందో తెలియదు కానీ ఓ థియేటర్‌లో కుర్రాళ్లు కొట్టుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. కేరళలోని సత్య సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది అని సమాచారం. విజయ్, అజిత్ అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచిందని, ఆ తర్వాత కొట్టుకున్నారు అని సమాచారం.

ఈ క్రమంలో స్క్రీన్‌కి కూడా కాస్త నష్టం జరిగిందట. దీంతో సినిమా ప్రదర్శనను కూడా నిలిపేశారని సమాచారం. ఇదంతా చూస్తుంటే ప్రపంచం ముందుకెళ్తుంటే ఈ ఫ్యాన్స్‌ మాత్రం ఇంకా రాతి యుగంలోకి వెళ్తున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇది హీరోల ఫ్యాన్స్‌ మధ్య వివాదం కాదని, రెండు గ్రూపుల మధ్య వివాదం అని కూడా అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

రాజాసాబ్.. చివరికి ఇన్ని సమస్యలా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus