నందమూరి తారక రామారావు…ఈ పేరు వింటేనే అభిమానంతో తెలుగు ప్రజలు ఉప్పొంగి పోతారు. అయితే ఆయన మనుమడు, నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ నిన్న తన 33వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. మరో పక్క ఆయన జన్మధిన వేడుకలను ఆయన అభిమానులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ హంగామా చేశారు. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రావాలంటు అభిమానులు పిలుపునిస్తున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓటమిపాలైనప్పటికీ ఎన్టీఆర్ ప్రచారం ఆ పార్టీకి బాగా కలసి వచ్చింది అనే చెప్పాలి.
అయితే ప్రమాదవశాత్తూ ఆక్సిడెంట్ అవ్వడం వల్ల అనుకోకుండా ఆయన ప్రచారాన్ని ముగించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 2014ఎన్నికల్లో మారిన సమీకరణాలు, ఎన్టీఆర్ కు బాబాయ్ బాలయ్యకు మధ్య పెరిగిన దూరం వెరసి జూనియర్ ప్రచారానికి దూరం అయ్యారు. అంతేకాకుండా బాలయ్య, మరియు చంద్రబాబు కు కూడా కాస్త దూరంగా ఉంటునట్లు అక్కడక్కడ వినిపిస్తున్న వాదన. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, ఆయన ఎప్పుడూ మయ కుటుంభ సభ్యుడే అని, టీడీపీ భావిస్తుంది. అనంతపురంలో ఎన్టీఆర్ 33వ జన్మధిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ అభిమాన సంఘం రాష్ట్ర నాయకుడు నరేంద్ర చౌదరి మాట్లాడుతూ..ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావల్సిన సమయం ఆసన్నం అయ్యిందని తెలిపారు. మరో పక్క ఎన్టీఆర్ కూడా తన తాత పెట్టిన పార్టీలో చివరి వరకూ కొనసాగుతాను అని తెలిపాడు…మరి అభిమానుల పిలుపుకు ఎన్టీఆర్ ఏమంటాడో చూడాలి.