Kalki: ‘కల్కి’ టీమ్‌కి ‘గణపథ్‌’ను ట్యాగ్‌ చేస్తున్న నెటిజన్లు… ఎందుకంటే?

ఒక సినిమా ట్రైలర్‌ వచ్చినప్పుడో, టీజర్‌ రిలీజ్‌ అయినప్పుడో అందులోని సీన్స్‌, మ్యూజిక్‌… వేరే సినిమాలతో కంపేర్‌ చేసి చూడటం మనకు కొత్తేమీ కాదు. ఆ తర్వాత ఆ విషయాలు పట్టుకుని సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌ చేయడం, మీమ్స్‌ రెడీ చేయడం కూడా చూసే ఉంటారు. అయితే ఈ క్రమంలో సినిమా సంగతేంటో తెలియకుండానే మాట్లాడేస్తున్నారు అనే అపవాదు కూడా ఉంది అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌ ఓసారి ఈ సినిమా సంగతి చూడాలి అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాల్లో ‘గణపథ్‌’ ఒకటి. టైగర్‌ ష్రాఫ్‌, కృతి సనన్‌, అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. విజయదశమి కానుకగా అక్టోబరు 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు, ప్రేక్షకులు… ‘కల్కి’ (Kalki) సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. కారణం రెండు సినిమాల కాన్సెప్ట్‌ దగ్గరగా ఉండటమే.

వికాస్‌ భల్‌ దర్శకత్వం వహిస్తున్న ‘గణపథ్‌’ సినిమాలో 2070 ఏడీ కాలం నాటి పరిస్థితులు, కథను వివరిస్తామని టీమ్‌ టీజర్‌తో చెప్పకనే చెప్పేసింది. విజువల్స్‌ కూడా భారీగానే ఉన్నాయి. భవిష్యత్తులో జరగబోయే విపత్తులను సూపర్ హీరో ఎదుర్కోవడమే సినిమా కథ అని చెబుతున్నారు. దీంతో ‘కల్కి’ టీమ్‌ ఈ విషయం ఓసారి చూడండి, రెండూ ఒకేలా ఉండవు అనే మాట చెప్పండి అంటూ దర్శకుడు నాగీ అలియాస్‌ నాగ్‌ అశ్విన్‌ను నెటిజన్లు కోరుతున్నారు.

‘వార్‌’ సినిమాతో పాన్‌ ఇండియా లెవల్‌లో ప్రేక్షకులకు పరిచయమైన ఇప్పుడు ‘గణపథ్‌’ను పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల చేసి ఆ రేంజి హిట్‌ కొట్టాలని చూస్తున్నాడు. సినిమా రాకుండా ఇలా అనుకోవడం సరికాదేమో కానీ.. టీజర్‌ మాత్రం దగ్గరగా ఉంది అనొచ్చు. మరి ఈ విషయంలో ‘కల్కి’ సినిమా టీమ్‌ ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus