Mahesh Babu , Rajamouli: మహేష్ జక్కన్న మూవీ విషయంలో ఫ్యాన్స్ కోరిక ఇదే.. నెరవేరుతుందా?

Advertisement

మహేష్ (Mahesh Babu) రాజమౌళి (S. S. Rajamouli) కాంబో మూవీ రిలీజ్ కావాలంటే మరో మరో మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అయితే మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ సినిమా ఆలస్యమైనా పరవాలేదని సూపర్ స్టార్ మహేష్ బాబుకు పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు దక్కితే చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హాలీవుడ్ లెవెల్ లో మహేష్ కు గుర్తింపు దక్కి విజయాలు సొంతం కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ బడ్జెట్ కచ్చితంగా 1000 కోట్ల రూపాయలు క్రాస్ చేస్తుందని బడ్జెట్ పరంగా ఈ సినిమా చరిత్ర సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ ఆగష్టు నెల 9వ తేదీన వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో ఈ సినిమాతో ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో చూడాల్సి ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ స్క్రిప్ట్ మాత్రం అద్భుతంగా వచ్చిందని సమాచారం అందుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండగా సరికొత్త లుక్ లో మహేష్ కనిపించనుండటం అభిమానులకు ఒకింత ఆనందాన్ని కలిగిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ప్లానింగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ వరల్డ్ స్థాయిలో విడుదలై అదే స్థాయిలో హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారి 100 కోట్ల రూపాయలు అందుకుంటున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ పనులు త్వరలో మొదలుకానుండగా జక్కన్న నుంచి అధికారికంగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus