Jr NTR: తారక్ ఆ శుభవార్త చెప్పేదెప్పుడో.. ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కొడుకులు, కూతుళ్లు సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెరుగుతోంది. మహేష్ కూతురు సితార యాడ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని పెంచుకోగా జూనియర్ ఎన్టీఆర్ కొడుకులు మాత్రం ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తారక్ సినిమాలలో చిన్నపిల్లల పాత్రలు ఉన్నా కొడుకులతో ఆ పాత్రలు చేయించడానికి తారక్ ఆసక్తి చూపించడం లేదు. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకుల సినీ ఎంట్రీకి సంబంధించి స్పష్టత ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీలో అభయ్ రామ్ నటిస్తున్నారని ప్రచారం జరగగా అధికారకంగా ఎలాంటి స్పష్టత లేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు ఇస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు గత కొంతకాలంగా తారక్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. తారక్ ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరికే అవకాశం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం దేవర సినిమాకే పూర్తిస్థాయిలో పరిమితం కాగా ఈ సినిమాలో తారక్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. కొరటాల శివ ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సరికొత్త కథలను ఎంచుకుంటున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు సైతం తారక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

మంచి ఆఫర్లు వస్తే తారక్ కెరీర్ కు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ వరుస విజయాలు అందుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కమర్షియల్ లెక్కల్లో సరికొత్త రికార్డులను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus