Kalyan Ram: ఫ్యాన్స్ కోరికను కళ్యాణ్ రామ్ నెరవేరుస్తారా?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. అతనొక్కడే, పటాస్, బింబిసార సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. బింబిసార సినిమా ఇప్పటికే 25 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా ఈ సినిమా పెట్టుబడికి సమాన స్థాయిలో లాభాలను అందించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు.

అయితే బింబిసార సక్సెస్ ను కళ్యాణ్ రామ్ క్యాష్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ ఖాతాలో ఖాతాలో విజయాలు ఉన్నా వరుసగా కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్లు సాధించలేదు. కళ్యాణ్ రామ్ హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ కోరికను కళ్యాణ్ రామ్ నెరవేరుస్తారో లేదో చూడాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు డెవిల్, బింబిసార2 సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

డెవిల్ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా బింబిసార సీక్వెల్ బింబిసార2 సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రెండు సినిమాలతో కళ్యాణ్ రామ్ కు స్టార్ ఇమేజ్ దక్కడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ కూడా తను నటించిన ప్రతి ప్రాజెక్ట్ అంచనాలకు మించి సక్సెస్ సాధించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వివాదాలకు దూరంగా ఉండే హీరోగా పేరును సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లోనే ఎక్కువ సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. సొంత బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలతోనే కళ్యాణ్ రామ్ కు విజయాలు దక్కాయనే సంగతి తెలిసిందే.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus