Sai Pallavi: సాయిపల్లవికి షాకిస్తున్న అభిమానులు.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సాయిపల్లవి క్రేజ్ వల్లే సక్సెస్ సాధించిన సినిమాలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారనే సంగతి తెలిసిందే. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సాయిపల్లవి ఆ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో మంచి మార్కులు సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సాయిపల్లవి ఎక్కువగా ఏడ్చే పాత్రల్లో నటిస్తున్నారు.

ఎంతో చలాకీగా ఉండే సాయిపల్లవిని ఏడుపుగొట్టు పాత్రల్లో చూడలేకపోతున్నామని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లవ్ స్టోరీ సినిమాలో సైతం సాయిపల్లవి పాత్రకు సంబంధించి ఎమోషనల్ సీన్లు ఎక్కువగా ఉన్నాయి. విరాటపర్వంలో సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్ర చనిపోవడం ఆమె అభిమానులలో చాలామందికి నచ్చలేదు. త్వరలో సాయిపల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన గార్గి థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా కూడా సీరియస్ కథాంశంతోనే తెరకెక్కిన సినిమా అని తెలుస్తోంది.

సాయిపల్లవి ఇకముందు అయినా ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కే సినిమాలను ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి కూడా కమర్షియల్ సినిమాలపై, ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండే సినిమాలపై, స్టార్ హీరోల సినిమాలపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయిపల్లవి సరైన పాత్రలను ఎంచుకుంటే ఆమె కెరీర్ విషయంలో ఉన్నత స్థానాలకు ఎదగడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ కామెంట్ల గురించి సాయిపల్లవి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. సాయిపల్లవికి అన్ని వర్గాల ఫ్యాన్స్ ఉన్నారనే సంగతి తెలిసిందే. సాయిపల్లవి స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే ఆమె క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎన్టీఆర్ సాయిపల్లవి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus