టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు చాలామంది థమన్ పేరును సమాధానంగా చెబుతున్నారు. అయితే చేతిలో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు ఉన్నా క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వడంలో థమన్ ఫెయిలవుతున్నారని చాలామంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. థమన్ మ్యూజిక్ అంటే ఫ్యాన్స్ భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కెరీర్ తొలినాళ్లలో థమన్ మ్యూజిక్ అందించిన సినిమాలు మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి. అయితే థమన్ కు సినిమా ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి.
థమన్ మ్యూజిక్ బోర్ కొడుతోందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్న థమన్ ఆ సినిమాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. థమన్ కొన్ని సందర్భాల్లో తన ట్యూన్లను తానే కాపీ కొడుతున్నాడని చాలామంది చెబుతున్నారు. థమన్ బీజీఎంకు మంచి మార్కులు పడుతున్నా సాంగ్స్ విషయంలో మాత్రం థమన్ ఫెయిల్ అవుతున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
వరుసగా థమన్ చేతిలో పెద్ద సినిమాలు ఉన్నా ఆ పెద్ద సినిమాలకు థమన్ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారో లేదో చెప్పలేమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. థమన్ కొన్ని మంచి ప్రాజెక్ట్ లకు ఓకే చెబితే బాగుంటుంది తప్ప ఎక్కువ ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పడం సరికాదని నెటిజన్లు సూచిస్తున్నారు. నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్న కామెంట్ల విషయంలో థమన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
థమన్ ఈ విధంగా చేయని పక్షంలో భవిష్యత్తులో ఆయన కెరీర్ కు ఇబ్బందులు తప్పవు. గాడ్ ఫాదర్ మూవీ బీజీఎం విషయంలో థమన్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. థమన్ ఒక్కో ప్రాజెక్ట్ కు 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా థమన్ కు ఆఫర్లు వస్తుండటం గమనార్హం.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!