అన్ స్టాపబుల్ సీజన్2 విషయంలో అలా చేయక తప్పదా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఎనర్జీ లెవెల్స్ మామూలుగా ఉండవనే సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ సీజన్1 అంచనాలకు మించి సక్సెస్ కావడానికి ఈ షోకు హాజరైన గెస్ట్ లు, బీవీఎస్ రవి ప్రతిభ, బాలయ్య హోస్టింగ్ కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సీజన్ అంచనాలకు మించి ఆకట్టుకోగా సరైన గెస్ట్ లు లేక సెకండ్ సీజన్ మాత్రం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరుత్సాహపరుస్తున్న విషయం తెలిసిందే.

అన్ స్టాపబుల్ సీజన్2 ఫస్ట్ సీజన్ ను మించి ఆకట్టుకుంటుందని అందరూ భావించగా ఏ మాత్రం క్రేజ్ లేని సెలబ్రిటీలు, ప్రేక్షకుల్లో పెద్దగా గుర్తింపు లేని వాళ్లు ఈ షోకు హాజరవుతూ ఉండటం ఈ షోపై ఆసక్తిని తగ్గించేస్తోంది. చంద్రబాబు ఎపిసోడ్ బాగానే ఆకట్టుకున్నా ఆ తర్వాత ఎపిసోడ్లు ఇదే స్థాయిలో లేవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ సీజన్2 కు పూర్వ వైభవం వస్తుందని చెప్పవచ్చు.

ప్రభాస్ పెళ్లి, ప్రభాస్ అనుష్కల మధ్య రిలేషన్, కృతిసనన్ చేసిన కామెంట్ల గురించి ప్రధానంగా ఈ ఎపిసోడ్ లో చర్చించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఎపిసోడ్ ను త్వరగానే స్ట్రీమింగ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా అందుకు భిన్నంగా జరుగుతోంది. ప్రభాస్ తరహా స్థాయి ఉన్న సెలబ్రిటీలను గెస్ట్ లుగా పిలిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్, త్రివిక్రమ్ కాంబో ఎపిసోడ్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్, రామ్ చరణ్ లను వేర్వేరుగా కాకుండా ఒకే ఎపిసోడ్ కు ఇద్దరినీ ఆహ్వానిస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్లకు ప్రాధాన్యత ఇస్తే ఈ షో రేంజ్ కూడా మరింత పెరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య గెస్ట్ ల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తికి బాలయ్య చెక్ పెడతారో లేదో చూడాల్సి ఉంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus