NTR30: ఎన్టీఆర్30 మూవీ టైటిల్ గురించి అభిమానుల రియాక్షన్ ఇదే!

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి దేవర అనే టైటిల్ ఫిక్స్ అయిందనే సంగతి తెలిసిందే. ఈ టైటిల్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు కొరటాల శివ అభిమానులను సైతం ఆకట్టుకుంది. ఈ సినిమా టైటిల్ గురించి ఫ్యాన్స్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఊరమాస్ లుక్ ఆకట్టుకునేలా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక అభిమాని అయితే వచ్చాడు వచ్చేసాడు మా మాస్ దేవుడు అని కామెంట్ చేశారు.

ఎన్టీఆర్ వీరాభిమానులకు పోస్టర్ తెగ నచ్చేసింది. తారక్ లుక్ గత సినిమాలకు భిన్నంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పోస్టర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని ఒక అభిమాని ట్వీట్ చేశారు. లేడీస్ లో సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు క్రేజ్ పెరుగుతోంది. ఈ మూవీలో జాన్వీ లుక్ సైతం కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. సినిమా రిలీజ్ కు ఏడాది సమయం ఉండగా పండుగలు ఉన్న సమయంలో రిలీజ్ అవుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.

2024 సమ్మర్ మామూలుగా ఉండదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తారక్ హెయిర్ స్టైల్ ను సైతం మేకర్స్ కొత్తగా ప్లాన్ చేశారు. (NTR30) ఎన్టీఆర్30 జక్కన్న సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తారక్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సోలో హీరోగా తారక్ కు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ను అందిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వరుస విజయాలతో తారక్ చరిత్ర తిరగరాయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మే 20వ తేదీన తారక్ పుట్టినరోజు కాగా తారక్ ప్రశాంత్ నీల్ తారక్ అయాన్ ముఖర్జీ కాంబో సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయేమో చూడాల్సి ఉంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus