దేవర1 (Devara) సినిమా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానుల్లో చాలామందికి నచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ అవసరం అని కామెంట్లు చేసే అభిమానుల కంటే అవసరమా అని కామెంట్లు చేసే అభిమానులు ఎక్కువమంది ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం దేవర సీక్వెల్ అవసరం లేదని ప్రీక్వెల్ కావాలని చెబుతున్నారు. దేవర వరకు తమ పూర్వీకులు ఎంత గొప్ప వీరులు అనే విషయాలను కథలుకథలుగా చెబుతారు. దేవరలో వాళ్ల గురించి చెబుతున్న సమయంలో వచ్చిన షాట్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
వాళ్ల చరిత్రకు సంబంధించిన సన్నివేశాలతో సినిమాను ప్లాన్ చేస్తే మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి దేవర తండ్రి పాత్రను క్రియేట్ చేస్తే మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అభిమానుల నుంచి వచ్చిన కామెంట్లను పరిగణనలోకి తీసుకుని దేవర మేకర్స్ ఏవైనా మార్పులు చేస్తారేమో చూడాల్సి ఉంది.
దేవర తర్వాత పార్ట్ పై అంచనాలు పెరగాలంటే మాత్రం ఈ దిశగా అడుగులు వేస్తే మంచిదని చెప్పవచ్చు. టికెట్ బుకింగ్స్ బల్క్ లో బుక్ అవుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. అక్టోబర్ 10 వరకు దేవర జోరుకు బ్రేక్ వేయడం కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర హిందీ వెర్షన్ కలెక్షన్లు తక్కువే అయినా ఈ సినిమా టార్గెట్ ను సులువుగానే రీచ్ అవుతుందని కామెంట్లు వినిపిస్తుంది.
హిందీలో దేవర సినిమాకు రివ్యూలు పాజిటివ్ గానే ఉండటం గమనార్హం. దేవర హిందీ వెర్షన్ బుకింగ్స్ సైతం నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ మార్కెట్ ను క్రమంగా పెంచుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర ఫుల్ రన్ లో 700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.