Allu Arju: సొంత సినిమా ఈవెంట్లకు వెళ్లొద్దు… అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. అయితే ఈయన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా నిఖిల్ హీరోగా నటించిన 18 పేజెస్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కడ ఆ సినిమా కన్నా చాలా మంది పుష్ప సినిమా గురించి అలాగే అల్లు అర్జున్ గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ఇదే అదునుగా భావించి తనపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇలా సొంత ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించిన సినిమాలకు అతిథిగా రావడం తనకు తానే సొంత డబ్బా కొట్టుకోవడం అంటూ యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు చేయడంతో

ఈ విషయంపై అల్లు అర్జున్ ఆర్మీ స్పందించి ఇకపై మీరు మీ సొంత నిర్మాణంలో నిర్మించిన సినిమా ఈవెంట్లకు ముఖ్య అతిథిగా రావద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలా తన సొంత నిర్మాణంలో రాబోతున్న సినిమా ఈవెంట్లకు రావడం అక్కడ పుష్ప 2 సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉన్నారు. ఇంకా ఈ సినిమా విడుదల అవ్వడానికి దాదాపు సంవత్సరం కాలం పడుతుంది.

ఈ క్రమంలోనే పబ్లిక్ గా ఇలా సినిమాను హైలైట్ చేయడం అంటే ట్రోల్లెర్స్ ను ఆహ్వానించినట్లేనని భావించిన అల్లు అర్జున్ అభిమానులు తనని సొంత సినిమా ఈవెంట్లకు రావద్దని రిక్వెస్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus