స్టార్‌ హీరోల సినిమాలకు నామకరణం చేయడం లేదు.. అందుకేనా?

  • October 14, 2022 / 07:15 AM IST

సినిమా టైటిల్‌ పెట్టడం వల్ల ఎంత ప్రయోజనం ఉందో, టైటిల్‌ పెట్టకపోవడం వల్ల కూడా అంతే ప్రయోజనం ఉంది అంటుంటారు. అదెలా అంటారా? ముందుగా పేరు పెట్టేస్తే ఆ పేరుతో ఈజీగా ప్రచారం చేసుకోవచ్చు. ఫలానా హీరో సినిమా, ఫలానా దర్శకుడు కాంబో అనక్కర్లేదు. అదే పేరు పెట్టకపోతే.. ఆ సినిమా పేరేంటి? పేరు ఇదేనా? టైటిల్‌ అదేనా అంటూ చర్చ జరుగుతుంది. దీంతో వద్దన్నా ప్రచారం. అలా పేర్లు పెట్టకుండా.. దాగుడుమూతలు ఆడుతున్న స్టార్ల సినిమాల సంగతి చూద్దాం. కొన్ని పేర్లు చెప్పేసినా.. పోస్టర్ల మీద వేయకుండా నిర్మాతలు చేస్తున్న ప్రచారాలూ ఉన్నాయి. వాటి సంగతీ చూద్దాం.

* చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఇలా సినిమా పేరు చెప్పేయొచ్చు ఎందుకంటే చిరంజీవే చెప్పారు. కానీ చిత్రబృందం పోస్టర్ల మీద ఈ పేరు రాయడం లేదు. దీంతో పేరు తెలిసినా, తెలియనట్లు ఉండాల్సి వస్తోంది.

* బాలకృష్ణ ‘అఖండ’ సినిమా పేరు చాలా రోజులు రివీల్‌ చేయుకుండా BB3 అంటూ కావాల్సినంత ప్రచారం సంపాదించారు. ఆ తర్వాత విడుదలకు ముందు ‘అఖండ’ అంటూ పేరు చెప్పారు. అచ్చంగా ఇదే స్ట్రాటజీ వాడుతున్నారు గోపీచంద్‌ మలినేని సినిమాకు. ఈ సినిమాకు ‘జై బాలయ్య’, ‘అన్న గారు’, ‘రెడ్డి గారు’, ‘వీర సింహా రెడ్డి’ అంటూ పేర్లు వినిపిస్తున్నాయి. దీంట్లో ఏది నిర్ణయిస్తారో చూడాలి.

* ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ చేస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్‌ కె’. ఇది కేవలం వర్కింగ్‌ టైటిలే అని టీమ్‌ ఇప్పటికే చెప్పింది. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లాగా వర్కింగే టైటిలే నిజమైన టైటిల్‌ అవుతుంది అని కొంతమంది అంటున్నారు. ఇది తెలియాలంటే సినిమా ఎప్పుడు విడుదల అనేది తెలియాలి.

* మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ మూడో సినిమా అనౌన్స్‌ చేసినప్పటి నుండి చాలా పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. చాలా రోజులు వాయిదాలు పడుతూ పడుతూ మొన్నీమధ్యే ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ‘పార్థు’ అనే పేరు పరిశీలిస్తున్నారని టాక్‌. అయితే ‘అ’ సెంటిమెంట్‌తో ఓ టైటిల్‌ చూస్తున్నారు అని టాక్‌. దీని కోసం ‘అర్జునుడు’ అనే పేరు ఆ మధ్య చర్చల్లోకి వచ్చింది. మరి అదే అవుతుందా? వేరేది అవుతుందా అనేది చూడాలి.

* ఎన్టీఆర్‌ – కొరటాల శివ సినిమా షూటింగ్‌ అయితే మొదలవ్వలేదు కానీ.. సినిమా అయితే చాలా రోజుల నుండి ప్రజల నోళ్లలో నానుతోంది. దానికి కారణం వారి కాంబినేషన్‌. గతంలో రెండు హిట్లు ఇచ్చిన కాంబో అది. సినిమా మొదలయ్యేటప్పుడు టైటిల్‌ చెబుతారో లేదో.

* రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమా మొన్నీ మధ్య కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకుంది. ఈ సినిమా మొదలైనప్పుడే ఇది ప్రభుత్వాధికారి కథ అని చెప్పేశారు. దీంతో ‘సర్కారోడు’, ‘అధికారి’ అంటూ కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. కానీ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు.

* వెంకట్‌ ప్రభు సినిమాల టైటిల్స్‌, ట్యాగ్‌ లైన్స్‌ భలే కొత్తగా ఉంటాయి. ఆయన గత సినిమాల గురించి తెలిసిన వాళ్లకు ఇది కొత్త విషయమేమీ కాదు. ఆయన నాగచైతన్య – కృతి శెట్టితో ఓ సినిమా చేస్తున్నారు. పోలీసు నేపథ్య కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘302’ అనే పేరు అనుకుంటున్నారట. అది సినిమాలో హీరో డీల్‌ చేసే కేస్‌ నెంబరు అని టాక్‌.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus