నటికి పూజలు చేస్తున్న ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

తెరమీద కనిపించే హీరో హీరోయిన్లకి అభిమానులు, వీరాభిమానులు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. హీరోల విషయం పక్కన పెడితే హీరోయిన్ల మీద అభిమానాన్ని చూపించే విధానం మాత్రం కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఫేవరెట్ యాక్ట్రెస్ పేరు టాటూ వేయించుకోవడం లాంటి సంఘటనలు చూశాం. ఇక తమిళనాట అభిమానుల తీరే వేరుగా ఉంటుంది. ఖుష్బు, నమిత లాంటి పలువురు నటీమణులకు ఏకంగా గుడి కట్టి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు కోలీవుడ్ యంగ్ హీరోయిన్ యషికా ఆనంద్ ఫోటోలకు పూజలు చేస్తూ..

హారతులిస్తున్న పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. నటి యషికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డెవోటీ ఆఫ్‌ యషిక’ అనే ఫ్యాన్‌ పేజ్ ఉంది. దాదాపు 900 మందికి పైగా ఫ్యాన్స్‌ ఆ పేజీని ఫాలో చేస్తున్నారు. వారితో పాటు యషిక కూడా అందులో ఉంది. ఫ్యాన్స్‌ ఆమె గురించి పెట్టే పోస్టులకు స్వయంగా ఆమే రిప్లై ఇస్తూ ఉంటుంది.

తాజాగా, కొంతమంది యషిక ఫ్యాన్స్‌ ఆమె ఫొటోలకు హారతులు ఇస్తూ.. మొక్కుతూ దేవతలా పూజించటం మొదలుపెట్టారు. తాను అందరిలాంటి మనిషినేనని.. దేవుళ్లకు మాత్రమే పూజలు చేయండి.. నాకు కాదు అంటూ యషిక, ఫ్యాన్స్‌ని రిక్వెస్ట్ చేశారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus