‘జాతిరత్నాలు’ సినిమాలో ఫరియా అబ్దుల్లాను చూసే ఎవరికైనా ఈ అమ్మాయి నటనకు కొత్త కాదు అని తెలిసిపోతుంది. ఏదో ఆరేడేళ్లు ఇండస్ట్రీలో ఉన్నాక చేసిన సినిమా అనిపిస్తోంది. ఇది నిజమే.. కానీ ఆమె ఉన్నది ఇండస్ట్రీలో కదు నటనలో. అందుకే అంత అలవోకగా నటించేసింది ఆ సినిమాలో. అంతేకాదు ఇప్పుడు అవకాశం వస్తే ఏకంగా డైరక్షన్ కూడా చేస్తా అంటోంది. అసలు అంత ధైర్యం ఆమెకు ఎలా వచ్చింది. ఎందుకు అలా అంది… ఆమె మాటల్లోనే చదివేయండి మరి.
ఫరియా అబ్దుల్లా కాలేజీ చదివంతా హోం స్కూలింగ్ పద్ధతిలోనే జరిగిందట. దీంతో ఆమె మిగిలిన సయంలో లలిత కళల మీద దృష్టి పెట్టేదట. అలా పెయింటింగ్, సాహిత్యం నేర్చుకుంది. దాంతో నాటక రంగం మీదకు దృష్టి వెళ్లిందట. అలా నాటక రంగంలోకి వచ్చాక ఏడేళ్ల పాటు వివిధ నాటికల్లో పాల్గొందట. అంతేకాదు నాటకాలు రాయడం, డైరక్షన్ కూడా చేసిందట. అదన్నమాట సంగతి. అందుకే అంత యాక్టివ్‌గా చిట్టి పాత్రను చేసేసింది. అంతేకాదు సినిమా కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ కూడా చెప్పింది ఫరియా.
‘జాతిరత్నాలు’ తర్వాత ఫరియా కొత్త సినిమా ఓకే చేయలేదు. తెలుగులో ఇప్పటికే కొత్త సినిమా కథలు వింటోందట. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనుకోవడమే… ఆమె నెక్స్ట్ సినిమా ఆలస్యం వెనుక కారణమట. తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ ఏ భాషా అయినా నటించడానికి సిద్ధమని చెబుతోంది ఫరియా. అంతే కాదు… ఓటీటీ వెబ్ సిరీస్‌ల్లోనూ నటించడానికి సిద్ధమట. అయితే నటనకు ప్రాధాన్యమున్న పాత్ర అయితేనే అనే షరతు తప్పదని చెబుతోంది. అంతేకాదు ఓ కథ సిద్ధం చేసుకొని, ఏదో ఒక రోజు డైరక్షన్ కూడా చేస్తానంటోంది ఫరియా. ఆల్ ది బెస్ట్ చిట్టి.
strong>Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!