Faria Abdullah: పెళ్లి చేసుకుంటే ఒక్కరితోనే ఉండాలి.. నటి కామెంట్స్ వైరల్!

ఫరియా అబ్దుల్లా పరిచయం అవసరం లేని పేరు జాతి రత్నాలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించి అందరిని మెప్పించిన ఈ హైదరాబాది బ్యూటీ అనంతరం పెద్దగా సినిమా అవకాశాలను అందుకోలేదు. ఈమె ఈ సినిమా తర్వాత నాగచైతన్య నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సినిమా తర్వాత ఈమె ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు

అయితే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఫరియా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బోల్డ్ ఫోటోషూట్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం అదేవిధంగా ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా కూడా సందడి చేస్తున్నారు. ఇలా పలు డాన్స్ వీడియోల ద్వారా ఈమె సోషల్ మీడియాలో అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ రోజురోజుకు అభిమానులను పెంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో ఈమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి గురించి ఫరియా మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒకరితోనే ఉండాలి.అలా లైఫ్ లాంగ్ ఒకరంటే నాకు ఇష్టం ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారడంతో ఇలాంటి ఆలోచనలు ఉన్నవారే పెళ్లిళ్లు చేసుకొని వెంటనే విడాకులు తీసుకుంటున్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా లైఫ్ లాంగ్ ఒకరితో కాకుండా ఎంతమందితో ఉండాలని ప్లాన్ చేసుకున్నావు అంటూ మరికొందరు బోల్డుగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus