సాధారణంగా ఫిబ్రవరి (February) నెలను సినిమా మార్కెట్‌లో ఎక్కువగా లైట్‌గా తీసుకుంటారు. మార్చి నుంచి ఎగ్జామ్ సీజన్ మొదలయ్యే క్రమంలో థియేటర్ల రన్ బాగా తగ్గిపోతుంది. కానీ ఈసారి మాత్రం కొన్ని చిత్రాలు ఊహించని విధంగా హిట్ అయ్యాయి. కొన్ని పెద్ద సినిమాలు డిజాస్టర్‌గా మిగిలాయి. మొత్తానికి ఫిబ్రవరి నెలలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగినవి కొన్ని మాత్రమే. ఈ నెల ప్రారంభంలో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన పట్టుదల ‘(Pattudala) రాబోయే క్రేజ్‌ని తట్టుకోలేకపోయింది. కోలీవుడ్‌లోనూ, తెలుగులోనూ భారీగా అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా దాదాపు 70 కోట్లు పోగొట్టి డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
అదే వీక్ లో విడుదలైన నాగచైతన్య (Naga Chaitanya) తండేల్ (Thandel) మాత్రం పూర్తి భిన్నంగా, విజయవంతంగా నిలిచింది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. 100 కోట్లకు వసూళ్లు రాబట్టి, చైతూ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న హిట్‌గా నిలిచింది. తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన లైలా (Laila) వచ్చి అంచనాలను మించలేకపోయింది. ప్రయోగాత్మక చిత్రాలు చేసే విశ్వక్ ఈసారి కూడా కొత్త తరహా కథతో వచ్చాడనే చెప్పాలి. కానీ ఆ ప్రయోగం ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు.
దాదాపు 6 కోట్ల నష్టంతో డిజాస్టర్‌గా మిగిలిన ఈ సినిమాను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. దీంతో విశ్వక్ భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు చేయనని క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉండగా, బాలీవుడ్ మూవీ చావా (Chhaava) కూడా ఫిబ్రవరిలో మంచి వసూళ్లు సాధించింది. తెలుగులో హిందీ వెర్షన్ మంచి ఆదరణ పొందడంతో, ఇప్పుడు దీనిని ప్రత్యేకంగా డబ్ చేసి మార్చి 7న విడుదల చేయనున్నారు. మరోవైపు, సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) తన కుమారుడు గౌతమ్‌తో (Raja Goutham) కలిసి చేసిన బ్రహ్మానందం (Brahma Anandam) ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు.
ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ వల్ల నిర్మాతలకు పెద్దగా నష్టం తీసుకు రాలేదు. ఇక ధనుష్ (Dhanush) దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా (Jaabilamma Neeku Antha Kopama), అలాగే ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return of the Dragon) రిలీజయ్యాయి. ఇందులో డ్రాగన్ మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా దీన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. చివరగా, సందీప్ కిషన్ (Sundeep Kishan) మజాకా (Mazaka) నిన్న విడుదలైంది. కామెడీ జానర్ కావడంతో వీకెండ్ బాక్సాఫీస్‌ను బాగానే ఆకట్టుకునే అవకాశముంది. మొత్తానికి ఫిబ్రవరిలో తండేల్, చావా, డ్రాగన్ హిట్స్‌గా నిలిచాయి. ఇక మజాకా ఫేట్ ఎలా ఉండబోతుందనేది కొన్ని రోజుల్లో తేలనుంది.