Samantha: ఫెమినా ఫాబ్ 40లో సామ్.. రియాక్ట్ అయిన నటి!

‘ఏ మాయ చేసావె’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సినిమాలు చేసి అక్కడ కూడా స్టార్ స్టేటస్ అందుకుంది. నాగచైతన్య వివాహం జరిగిన తరువాత సినిమాల విషయంలో సమంత చాలా సెలెక్టివ్ గా వ్యవహరిస్తోంది. కమర్షియల్ హీరోయిన్ రోల్స్ కి గుడ్ బై చెప్పేసి.. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకుంటోంది. అలానే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తుంది.

ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా సమంత వైవాహిక జీవితంపై పలు రూమర్లు వస్తున్నాయి. సామ్ తన భర్త చైతుతో విడిపోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని టాక్. దీనికి తగ్గట్లే సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో అక్కినేని అనే పదం డిలీట్ చేయడం.. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలు ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. అయితే ఇప్పటివరకు చైతు కానీ సమంత కానీ ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

తాజాగా సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ఫెమినా ఫాబ్ 40లో సమంతకు చోటు దక్కింది. ‘నాకు ఫిలిం ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు, నాలుగు సౌత్ ఇండియా ఇంటర్‌సేషనల్ మూవీ అవార్డులు, 3 సిని’మా’ అవార్డులు గెలుచుకున్న 2021కి ఎంతో ప్రభావం చూపించే మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది’ అంటూ ఫెమినా పేర్కొంది. దీనిపై సమంత కూడా రియాక్ట్ అయింది. ఇది తనకు ఎంతో గర్వకారణమని.. థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది సమంత.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus