కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల్లో వచ్చి.. దేశాన్ని షేక్ చేసిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమాను ఓ సంచలనం అనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అదే సినిమా చర్చకు దారి తీసింది. దీనికి కారనం ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆ సినిమా వేసినప్పుడు ఆ ఫెస్టివల్ జ్యూరీ హెడ్ చేసిన కామెంట్సే. ఆయన అన్న మాటలకు ఆ దేశం తరఫున క్షమాపణలు వచ్చినప్పటికీ.. ఇంకా ఆ చర్చ కొనసాగుతూనే ఉంది. ఆ సినిమాలో నటులు, దర్శకుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రదర్శించగా. ఆ సినిమా ‘అసభ్యకర’ చిత్రం అంటూ.. జ్యూరీ అధినేత, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని చూసి ఇఫి జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చూసి షాక్ అయ్యా. ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రంలా ఈ సినిమా ఉంది’’ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే లాపిడ్ వ్యాఖ్యలు ఆయన ‘వ్యక్తిగత అభిప్రాయం’ అంటూ జ్యూరీ బోర్డు అంది.
మరోవైపు లాపిడ్ వ్యాఖ్యలను భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ఖండించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు కూడా చెప్పారు. కానీ ‘ద కశ్మీర్ ఫైల్స్’ టీమ్ ఆగ్రహజ్వాలలు ఆగడం లేదు. లాపిడ్ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూదులపై దారుణమైన మారణహోమం వంటి బాధలను అనుభవించిన వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. దేవుడు ఆయనకు తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ ఘాటుగానే చెప్పారు. నిజాలు చూడలేకపోతే.. నోరు మూసుకుని కూర్చోవాలి అంటూ ఘాటుగా స్పందించారు.
మరోవైపు ‘ది కశ్మీరీ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ‘‘నిజం చాలా ప్రమాదకరమైనది. ఇది ప్రజలతో అబద్దాలు చెప్పిస్తుంది’ అంటూ లాపిడ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. అయితే ఈ మొత్తం విషయమై ఇజ్రాయెల్ రాయబారి నావొర్ గిలాన్ మాట్లాడుతూ ‘‘లాపిడ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. దీనికి ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం గురించి తెలియగానే అనుపమ్ ఖేర్‌కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాను. ‘కశ్మీర్ ఫైల్స్’ ప్రచార చిత్రం కాదు. కశ్మీరీల బాధలను చెప్పిన బలమైన చిత్రం’’ అని అన్నారు. అయితే ఈ చర్చ ఎక్కడికి వెళ్తుందో చూడాలి.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..