ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 68వ ఎడిషన్ వేడుక ఇటీవల ముంబయిలో జరిగింది. ఈ ఏడాది అవార్డుల్లో ‘గంగూబాయి కాఠియావాడి’, ‘బాదాయ్ దో’ సినిమాలకు అవార్డుల భారీగా వచ్చాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో ‘గంగూబాయి కాఠియావాడి’ సినిమా పురస్కారాలను అందుకుంది. ఉత్తమ నటుడు సహా 6 కేటగిరీల్లో ‘బదాయ్ దో’ సినిమా పురస్కారాలు సాధించింది. గతేడాది భారీ విజయం అందుకున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ -2023 విజేతలు పూర్తి జాబితా ఇదిగో…
ఉత్తమ చిత్రం: గంగూబాయి కాఠియావాడి
దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)
చిత్రం (క్రిటిక్స్): బదాయ్ దో
నటుడు: రాజ్‌కుమార్ రావ్ (బదాయ్ దో)
నటుడు (క్రిటిక్స్): సంజయ్ మిశ్రా (వధ్)
నటి: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి)
నటి (క్రిటిక్స్): టబు (భూల్ భులయా2), భూమి పెడ్నేకర్ (బదాయ్ దో)
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం: ప్రేమ్ చోప్రా
ఆర్డీ బర్మన్ అవార్డు: జన్వీ శ్రీమంకర్ (దోలాడియా : గంగూబాయి కాఠియావాడి)
సహాయ నటుడు: అనిల్ కపూర్ (జుగ్ జుగ్ జియో)
సహాయ నటి: షీబీ చద్దా (బదాయ్ దో)
తొలి చిత్ర దర్శకుడు: జస్పాల్ సింగ్ సంధు, రాజీవ్ బర్నవాల్ (వధ్)
తొలి చిత్ర నటుడు: అంకుష్ గీదమ్ (ఝండ్)
తొలి చిత్ర నటి: ఆండ్రియా కెవిచూసా (అనేక్)
డ్యాన్స్ కొరియోగ్రఫీ: కృతి మహేశ్ (దోలిడియా – గంగూబాయ్ కాఠియావాడి)
గీత రచయిత: అమితాబ్ భట్టాచార్య (‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని కేసరియా…)
మ్యూజిక్ ఆల్బమ్: ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర – శివ)
నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్ (కేసరియా…: బ్రహ్మాస్త్ర – శివ)
నేపథ్య గాయని: కవిత సేథ్ (రంగిసరి…- జుగ్‌జు జియో)
కథ: అక్షిత్ గిల్‌డియల్, సుమన్ అధికారి (బదాయ్ దో)
స్క్రీన్‌ప్లే: అక్షిత్ గిల్‌డియల్, సుమన్ అధికారి, హర్షవర్థన్ కుల్‌కర్ణి (బదాయ్ దో)
సంభాషణలు: ప్రకాశ్ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కాఠియావాడి)
సినిమాటోగ్రఫీ: సుదీప్ ఛటర్జీ (గంగూబాయి కాఠియావాడి)
ప్రొడక్షన్ డిజైన్: సుబ్రత చక్రవర్తి, అమిత్ రాయ్ (గంగూబాయి కాఠియావాడి)
కాస్ట్యూమ్స్: సీతల్ ఇక్బాల్ శర్మ (గంగూబాయి కాఠియావాడి)
సౌండ్ డిజైన్: బిస్వదీప్ దీపక్ ఛటర్జీ (బ్రహ్మాస్త్ర – శివ)
ఎడిటింగ్: నినద్ కనోల్కర్ (యాక్షన్ హీరో)
యాక్షన్: పర్వేజ్ షేక్ (విక్రమ్ వేద)
వీఎఫ్‌ఎక్స్: డెంజ్, రెడీఫైన్ (బ్రహ్మాస్త్ర – శివ)
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?