ఈ లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. దాంతో ఓటిటి అనేది.. ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయింది. దాంతో తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాలను ఓ చూపు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలో తెలుగులో కొన్ని రీమేక్ సినిమాలను తెరకెక్కించాలి అనుకున్న దర్శక నిర్మాతలకు ఎక్కడ లేని టెన్షన్ పట్టుకుంది. ఈ టైములో ఒరిజినల్స్ ను చూసేస్తే.. రీమేక్ చేసిన సినిమాలను జనాలు పట్టించుకుంటరా అని..! ‘జాను'(96 రీమేక్) పరిస్థితి ఏమయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ‘లూసీఫర్’ రీమేక్ విషయంలో చిరు కంగారు పడటం లేదు. స్క్రిప్ట్ ఆయనకు అనుకూలంగా రెడీ అయినప్పుడే అనౌన్స్ చెయ్యాలని వెయిట్ చేస్తున్నారు.
ఇక ‘అంధాదున్’ రీమేక్ చేస్తున్న నితిన్ కూడా అంతే..! ఇప్పటికే ‘అంధాదున్’ ను చాలా మంది చేసేశారు. దాంతో తెలుగులో రీమేక్ చేసినప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు రావాలి అంటే.. అందులో సంథింగ్ స్పెషల్ ఉండాలి. ఒరిజినల్ లో టబు చేసిన పాత్ర చాలా కీలకం. ఆ పాత్రను ఇక్కడ వేరే హీరోయిన్ తో చేయిస్తే బాగుంటుంది అని ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో ఇలియానా, నయనతార, అనసూయ, ప్రియమణి వంటి వారిని సంప్రదించారు. ఇలియానా నెగిటివ్ రోల్ కాబట్టి చెయ్యను అనే చెప్పేసింది.
నయన్ మాత్రం 8కోట్లు పారితోషికం ఇస్తేనే కానీ చెయ్యను అంటుందట. నయన్ విషయంలో నిర్మాత నితిన్ ఇంకా ఓ డెసిషన్ కు రాలేదు. డిస్కషన్లు జరుపుతూనే ఉన్నాడు. అయితే నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత అయిన సుధాకర్ రెడ్డి మాత్రం టబు నే ఫైనల్ చెయ్యమని. 1 కోటి లోపే అయిపోతుంది అని చెప్పారట. ఆయన మాట విని నితిన్.. టబునే ఫైనల్ చేస్తే.. ఇక ‘అంధాదున్’ రీమేక్ లో అట్రాక్ట్ చేసే విషయం ఏముంటుంది?
Most Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!