మహేష్ తో మొదలుపెడితే చైతూ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది..!

‘మజిలీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాగ చైతన్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఇప్పటికే తన మావయ్య వెంకటేష్ తో ‘వెంకీమామ’ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో పాటు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ కావడం విశేషం. ఇదిలా ఉంటే..చైతన్య త్వరలోనే ఓ బాలీవుడ్ రీమేక్ లో నటించబోతున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

విషయంలోకి వెళితే.. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘చిచోరే’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారట. ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించబోతున్నాడట. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్(బుజ్జి) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ సినిమా మొదలు కాలేదు. అల్లు అర్జున్,మహేష్,ప్రభాస్ వంటి హీరోలకు కూడా కథలు చెప్పాడు కానీ వాళ్ళు తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో చివరికి చైతన్య దొరికినట్టు తెలుస్తుంది.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus