Anirudh Ravichander: అనిరుధ్ కారణంగా ఇబ్బంది పడుతున్న చిన్న సినిమా!

దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందిన అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) , తన సంగీతంతో అతి తక్కువ కాలంలోనే ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగారు. ఈయన ఇప్పటివరకు ఎక్కువగా తమిళ చిత్ర పరిశ్రమలో పని చేసినా, ఇటీవల పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్‌గా మారి, తెలుగు, హిందీ భాషల్లో కూడా తన ప్రతిభను నిరూపిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ అనిరుధ్ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనిరుధ్  ఒక చిన్న సినిమాకు మ్యూజిక్ అందించడంలో ఆలస్యం కావడం సినిమా యూనిట్‌ను ఇబ్బంది పెడుతోంది.

Anirudh Ravichander

ఆ స్మాల్ బడ్జెట్ సినిమా ‘మ్యాజిక్,’ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం తెలుగులో యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించినప్పటికీ, అనిరుధ్ నుండి సకాలంలో మ్యూజిక్ అందకపోవడం వలన విడుదల తేదీని వాయిదా వేయవలసి వస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

ఈ ఆలస్యం అనిరుధ్ ఫ్యాన్ బేస్‌తో పాటు, సినిమా అభిమానుల్లో కూడా నిరాశకు దారి తీస్తోంది. ఇప్పటికే అనిరుధ్ తమిళ, హిందీ, తెలుగు భాషల్లో పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ,’ ‘కూలీ,’ ‘విడా ముయార్చీ,’ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  -గౌతమ్ తిన్ననూరి  (Gowtam Naidu Tinnanuri)  సినిమా, నాని (Nani) -శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) సినిమా వంటి పెద్ద చిత్రాలుండటంతో ఆయన షెడ్యూల్ ఎంతో టైట్‌గా ఉంది.

అనిరుధ్ బడ్జెట్ భారీగా ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో, ‘మ్యాజిక్’ లాంటి చిన్న చిత్రాలపై ఆసక్తి చూపించలేకపోతున్నట్లు తెలుస్తోంది. ‘మ్యాజిక్’ యూనిట్ ఎప్పటినుంచో అనిరుధ్ నుండి ఫైనల్ సాంగ్స్ కోసం ఎదురుచూస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ ఆలస్యమవ్వడం వలన ఈ చిత్ర విడుదల మరలా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ చిత్రం కోసం గౌతమ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మ్యూజిక్ అందితే డేట్‌ ప్రకటనపై క్లారిటీ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

ఒక్క మాటతో అభిమాని గాలి తీసేసిన హరీష్ శంకర్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus