కోలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన సినిమాలు చేసే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విష్ణు విశాల్.అతను హీరోగా నటించిన ‘రాట్ససన్’ చిత్రం తెలుగులో కూడా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే మొదటిసారి అతను ‘ఎఫ్.ఐ.ఆర్’ అనే డార్క్ యాక్షన్ థ్రిల్లర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని… ‘విష్ణు విశాల్ స్టూడియోస్’ బ్యానర్ పై స్వయంగా హీరో విష్ణు విశాలే నిర్మించగా తెలుగులో మాత్రం మాస్ మహారాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
‘అభిషేక్ పిక్చర్స్’ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండడం విశేషం. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. అంతేకాదు ఇక్కడ ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది.
వాటి వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం | 0.57 cr |
సీడెడ్ | 0.18 cr |
ఆంధ్రా(టోటల్) | 0.65 cr |
ఏపి+తెలంగాణ (టోటల్) | 1.40 cr |
‘ఎఫ్.ఐ.ఆర్’ మూవీకి తెలుగులో రూ.1.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. విష్ణు విశాల్ సినిమా తెలుగులో డబ్ అవ్వడం ఇదే మొదటిసారి. రానా నటించిన ‘అరణ్య’ సినిమాలో ఇతను కీ రోల్ పోషించినప్పటికీ అది జనాలకి అంతగా రిజిస్టర్ కాలేదు. అలాంటి హీరో సినిమాకి ఇది మంచి బిజినెస్ అనే చెప్పాలి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.1.50 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.పోటీగా ‘ఖిలాడి’ ‘సెహరి’ ‘డిజె టిల్లు’ వంటి సినిమాలు ఉన్నాయి. వాటి పోటీని తట్టుకుని ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!