గీతాఆర్ట్స్-2 బ్యానర్ లో తెరకెక్కిన ‘చావు కబురు చల్లగా’ సినిమా విడుదలై వారం గడిచింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్, టాక్ ను బట్టి చూస్తుంటే గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై భారీ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమా కోసం హీరో కార్తికేయ చాలా కష్టపడ్డాడు. బాలరాజు పాత్ర కోసం ఎంతో హోమ్ వర్క్ చేయడంతో పాటు సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్నాడు.
హైదరాబాద్ లోనే మాత్రమే కాకుండా ఏపీ మొత్తం తిరిగి ఈ సినిమాను ప్రమోట్ చేశాడు. ఇప్పుడు అతడి కష్టం మొత్తం వృధా అయిందనే చెప్పాలి. భారీ పబ్లిసిటీ కారణంగా మొదటిరోజు ఈ సినిమా మంచి ఓపెన్గ్స్ రాబట్టింది. కానీ సినిమాకి బ్యాడ్ టాక్ రావడంతో రెండో రోజు నుండే సినిమా చతికిలపడింది. సినిమాలో దర్శకుడు చూపించిన పాయింట్ ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. తల్లీకొడుకులు కలిసి మందు కొట్టడం, తల్లి మరొకరితో ఎఫైర్ పెట్టుకోవడం వంటి విషయాలను కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు దర్శకుడు.
దీంతో ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. బిజినెస్ పరంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకి రూ.13 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. జీఏ2 బ్యానర్ పై ఉన్న నమ్మకంతో కాస్త ఎక్కువ రేట్లు పెట్టి మరీ ఈ సినిమా కొన్నారు. కానీ ఫైనల్ రన్ ముగిసేనాటికి ఈ సినిమా రూ.5 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయింది. హీరో కార్తికేయ గతంలో కూడా ఇలాంటి దెబ్బలు చాలానే తిన్నాడు. కానీ గీతాఆర్ట్స్ కి మాత్రం ఇది పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి.
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!