Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన ప్రముఖ నటుడు..?
- May 24, 2021 / 12:03 PM ISTByFilmy Focus
తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులు అభిమానించే స్టార్ హీరోగా పవన్ కళ్యాణ్ కు పేరుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి కొన్ని సినిమాల్లో నటించిన ఫిష్ వెంకట్ తాజాగా పవన్ కళ్యాణ్ గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయినప్పటికీ అందరికీ పవన్ ఒకే స్థాయిలో గౌరవం ఇస్తారని ఫిష్ వెంకట్ అన్నారు.
టెక్నీషియన్ చిన్నస్థాయి వ్యక్తి అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గౌరవిస్తారని ఫిష్ వెంకట్ తెలిపారు. స్థాయి భేదం లేకుండా పవన్ కళ్యాణ్ మర్యాదగా సంభోదిస్తారని ఫిష్ వెంకట్ పేర్కొన్నారు. తనను అన్నా లేదా వెంకట్ అని పిలుస్తారని పవన్ అభ్యంతర భాషలో మాట్లాడటం తాను ఇప్పటివరకు చూడలేదని పవన్ గొప్పదనం గురించి ఫిష్ వెంకట్ చెప్పుకొచ్చారు. పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన గబ్బర్ సింగ్ లో ఫిష్ వెంకట్ పాత్ర హైలెట్ అయింది.

గబ్బర్ సింగ్ తో పాటు మరో ఐదు సినిమాల్లో పవన్ కళ్యాణ్ తో కలిసి ఫిష్ వెంకట్ నటించడం గమనార్హం. మరోవైపు పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్నారు. హరిహర వీరమల్లు టీజర్ సెప్టెంబర్ 2వ తేదీన పవన్ పుట్టినరోజు కానుకగా రిలీజవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆరోజే టీజర్ రిలీజవుతుందని అధికారక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ పుట్టినరోజుకు చాలా సమయం ఉండటంతో టీజర్ కోసం అప్పటివరకు ఆగాలా..? అని పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

















