సినిమాల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇది కొత్త విషయమేమీ కాదు ఎప్పటి నుండో మన సినిమా నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందుకే ఒక్కో సినిమా ఒక్కో స్ట్రాటజీని వాడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే మేం చెప్పేది థియేటర్లలో విడుదలైనప్పుడు కాదు, ఓటీటీలోకి వచ్చేటప్పుడు. అవును థియేట్రికల్ స్క్రీనింగ్ పూర్తయి, ఓటీటీలోకి వచ్చినప్పుడు కూడా సినిమాకు భారీ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు కొత్తదనం కూడా చూపిస్తున్నారు.
అందులోనూ ఒకే సినిమా రెండు ఓటీటీల్లో విడుదలైనప్పుడు జరుగుతున్న ప్రచారం ఇంకా మజానిస్తోంది. ఒకే సినిమాకు డిఫరెంట్ ట్రైలర్లు కట్ చేయడం, వాటిని అంతేస్థాయిలో ప్రమోట్ చేయడం చూస్తూనే ఉన్నాం. దీంతోపాటు సోషల్ మీడియాలో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రచారం చేస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమాను ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల చేసినప్పుడు ఇలా ఎవరికి వారు ప్రచారం చేసి వావ్ అనిపించారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్ఆర్’ వంతు వచ్చింది.
తారక్, రామ్‌చరణ్‌తో రాజమౌళి తెరకెక్కించిన అద్భుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’. వెండితెరపై రూ. వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసి సినిమా అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చేసింది. ప్రాంతీయ భాషల సినిమాను జీ5లో విడుదల చేయగా, హిందీ వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో తీసుకొచ్చారు. దీని కోసం రెండు టీమ్‌లు సోషల్ మీడియా వేదికగా మంచి ప్రచారం చేస్తున్నారు. దీనికి విజువల్ ఎఫెక్స్ట్, గ్రీన్ మ్యాట్ లాంటివి వాడేస్తున్నారు.
దీని కోసం ఆయా ఓటీటీ సంస్థలు సొంతంగా వీఎఫ్‌ఎక్స్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్ టీమ్ ఓ వీడియోను రూపొందించింది. హిట్ సాంగ్ ‘నాటు నాటు..’ పాటను ఎడిట్ చేశారు. ఫేమస్ హుక్ స్టెప్‌తో ఎన్టీఆర్, చరణ్ ఫుట్‌బాల్ ఆడుతున్నట్లుగా ఎడిట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫుట్ బాల్ సీన్ సినిమాలో ఉండుంటేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతబాగా సింక్ అయ్యింది మరి. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!