Jr NTR: విదేశీయుల నోట జూనియర్ ఎన్టీఆర్ పాట.. వైరల్ అవుతున్న వీడియో..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, యూత్‌లో తనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జనరేషన్ హీరోల్లో ఆల్ రౌండర్ అనిపించుకున్న తారక్.. మొన్నటి వరకు ‘ఆర్ఆర్ఆర్’ అవార్డుల హంగామాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. జపాన్ వెళ్లినప్పుడు జపనీస్ భాషలో, అంతకుముందు కన్నడలో, అమెరికాలో అదిరిపోయే ఇంగ్లీష్ మాడ్యులేషన్‌తో ఆశ్చర్యపరిచాడు. ట్రిపులార్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ‘కొమరం భీముడో’ పాటలో తన పలికించిన హావభావాలకు అంతా ఫిదా అయ్యారు.

స్వయంగా జేమ్స్ కెమరూన్, ఈ సినిమాలో తారక్ ఇంట్రడక్షన్ గురించి ప్రశంసించారు. జూనియర్ ఎన్టీఆర్‌కి విదేశాల్లోనూ అభిమానులున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో పాటలు రీల్స్ చేయడం చూశాం. తాజాగా విదేశీ యువకులు ‘ఆది’ మూవీలోని ‘చికి చికి భం భం’ అనే పాటలోని సంగీతాన్ని పలికించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది ఓ పాపులర్ ఇంగ్లీష్ సాంగ్ అని.. అదే ఒరిజినల్.. మణిశర్మ కాపీ కొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus