Pawan Kalyan: నాలుగు సినిమాలున్నాయి… టైమ్‌ అంత లేదు.. ఏం చేస్తాడో మరి పవన్‌!

పవన్ కల్యాణ్‌ సినిమాల లెక్కేంటి? సంగతేంటి? ఇదేం ప్రశ్న వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉన్నాడు. మొన్నీమధ్యే రెండు సినిమాల గ్లింప్స్‌లు కూడా వచ్చాయి కదా అంటారా? అవును, మీరు చెప్పింది నిజమే.. అయితే డౌట్‌ ఎందుకొచ్చిందంటే.. పవన్‌ మళ్లీ పాలిటిక్స్‌లో బిజీ అయిపోతున్నాడు. ఇటీవల ఓ పొలిటికల్‌ ప్రెస్‌ మీట్‌లో జులై నుండి ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటాను అని చెప్పాడు. దీంతో వరుసగా షెడ్యూల్స్‌ పెట్టి సినిమాలు చేస్తున్నాడు కదా.. ఇప్పుడు ఇదేంటి అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో పవన్‌ (Pawan Kalyan) సినిమాల సంగతి మరోసారి చర్చనీయాంశంగా మారింది. పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుత లైనప్‌ చూస్తే.. నాలుగు సినిమాలో లైన్‌లో ఉన్నాయి. అందులో ఓ సినిమాకు సంబంధించి తన పాత్ర షూటింగ్‌ పూర్తికాగా, మరో మూడు సినిమాలు సెట్స్‌ మీద ఉన్నాయి. ఈ లెక్కన పవన్‌ మూడు సినిమాల షూటింగ్‌ పూర్తి చేయాలి. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే.. డిసెంబరులో ఎన్నికలు రావొచ్చు అని అంటున్నారు.

మరీ లేదంటే ఆ సమయానికి నోటిఫికేషన్‌ వస్తుంది అంటున్నారు. ఇలా ఎటు చూసినా, ఎలా చూసినా పవన్‌ దగ్గర ఆరు నెలలు ఉంది. అంటే.. అర్థమైందిగా పవన్‌ ఈ ఆరు నెలల్లో మూడు సినిమాల షూటింగ్‌ పూర్తి చేయాలి. ‘హరి హర వీర మల్లు’, ‘ఉస్తాద్ గబ్బర్‌ సింగ్‌’, ‘ఓజీ’ షూటింగ్‌లు పెండింగ్‌ ఉన్నాయి. ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ సినిమా షూటింగ్‌లో తన పాత్ర పూర్తయిపోయింది. అయితే పవన్‌ ఇప్పుడు షూటింగ్‌ చేస్తున్న స్పీడ్‌లో అయితే ఆరు నెలల్లో మూడు సినిమాలు అయిపోతాయి.

అయితే మధ్యలో ఎలాంటి బ్రేక్‌లు ఉండకూడదు. ‘ఉస్తాద్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాను సంక్రాంతికి తీసుకొద్దాం అనుకుంటున్నారట. ‘ఓజీ’ సినిమాను వచ్చే సమ్మర్‌కు తీసుకొస్తారని టాక్‌. ‘వినోదాయ చిత్తాం’ సినిమా రీమేక్‌ జులై ఆఖరున రావొచ్చు అని చెబుతున్నారు. ‘హరి హర వీర మల్లు’ సినిమా విషయంలో సరైన క్లారిటీ లేదు. అయితే ముందుగా చెప్పినట్లు అన్నీ అనుకున్నట్లుగా జరిగి షూటింగ్‌లో గ్యాప్‌లు రాకపోతోనే.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus