భరత్ అనే నేను ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా !
- August 30, 2017 / 06:49 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 27 న థియేటర్లోకి రానుంది. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న భరత్ అనే నేను మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. 2018 జనవరి 11 న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. అలా విడుదల తేదీ ఖరారు చేసిన వెంటనే ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలయిపోయింది. వంద కోట్ల బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి 130 బిజినెస్ జరిగినట్లు సమాచారం. అధికారికంగా సంతకాలు జరగక పోయినా ట్రేడ్ వర్గాల వారు తెలిపిన మేరకు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ రైట్స్ 80 కోట్లు పలికిందంట. ఓవర్సీస్ లో మహేష్ కి భారీ క్రేజ్ ఉంది.
అందుకే అక్కడివారు పోటీ పడి 18 కోట్లు చెల్లించడానికి సిద్ధమయినట్లు టాక్. ఇక తమిళనాడు, హిందీ రాష్ట్రాల రైట్స్ 20 కోట్లు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇక శాటిలైట్ రైట్స్ కలుపుకుంటే భరత్ అనే నేను 30 కోట్ల పైనే లాభాలను సృష్టించింది. శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















