‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ‘ఎఫ్2’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా… తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి చేసిన కామెడీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ 32 కోట్లకు జరుగగా.. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 60 కోట్ల షేర్ ని వసూల్ చేసి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్ లో కామెడీ చిత్రాలకి కాలం చెల్లిపోయింది.. ఓన్లీ బోల్డ్,అడల్ట్ కంటెంట్ చిత్రాలు మాత్రమే హిట్టవుతాయని కామెంట్ చేసిన వారందరికీ ఈ చిత్రంతో సమాధానం చెప్పాడు అనిల్ రావిపూడి. మిడిల్ ఆర్డర్ చిత్రాల్లో ఇప్పటి వరకూ విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రం టాప్ లో ఉంది. ‘గీత గోవిందం’ చిత్రం దాదాపు 70 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఇప్పుడు ఈ కలెక్షన్స్ ను బ్రేక్ చేసే దిశగా ‘ఎఫ్2’ చిత్రం దూసుకుపోతుండడం విశేషం. ఇక ‘ఎఫ్2’ చిత్రం ఏరియావైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
వెస్ట్ – 3.20 కోట్లు
కృష్ణా – 4.08 కోట్లు
గుంటూరు – 4.17 కోట్లు
నెల్లూరు – 1.54 కోట్లు
సీడెడ్ – 6.35 కోట్లు
తెలంగాణా + ఏపి = 49.15 కోట్లు
యూఎస్ఏ – 6.70 కోట్లు
కర్నాటక – 3.30 కోట్లు
రెస్ట్ అఫ్
ఇండియా – 1.05 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ – 60.2 కోట్లు
ఇక మరో వారం రోజులు ఇదే జోరు కొనసాగిస్తే… ‘ఎఫ్2’ చిత్రం ‘గీత గోవిందం’ కలెక్షన్లను దాటేయడం కాయం. ఇప్పట్లో అఖిల్ నటించిన ‘మిస్టర్ మజ్ను’ తప్ప మరే చిత్రం లేకపోవడం… అందులోనూ రిపబ్లిక్ డే సెలవు కూడా ఉండడం ‘ఎఫ్2’ చిత్రానికి కలిసొచ్చే అంశాలు. మరి ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..!