Gaalodu Collections: బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి హిట్ లిస్టులోకి చేరిన ‘గాలోడు’

బుల్లితెర పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్‍‍‍‍… హీరోగా చేసిన రెండో చిత్రం ‘గాలోడు’. మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందిన ఈ మూవీలో హీరోయిన్‌గా గెహ్నా సిప్పి నటించింది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ‘సంస్కృతి ఫిలింస్’ బ్యానర్ పై ఆయనే నిర్మించారు. టీజ‌ర్, ట్రైలర్‌ ఎలా ఉన్నా ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభించింది.

అయితే నవంబర్ 18న రిలీజ్ అయిన ఈ మూవీకి మొదటి రోజు మిక్స్డ్ నమోదైంది.అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. మొదటి రోజు కంటే మూడో రోజున ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసింది.4 వ రోజు కూడా ఎక్కువగా డ్రాప్స్ లేకపోవడం గమనార్హం. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.98 cr
సీడెడ్ 0.51 cr
ఆంధ్ర 1.07 cr
ఏపీ +తెలంగాణ 2.56 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.15 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.71 cr

‘గాలోడు’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సింది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 2.71 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ రూ.0.01 కోట్ల లాభాలను అందించింది.

ఆల్రెడీ బయ్యర్స్ సేఫ్ అయ్యారు కాబట్టి.. ఇక నుండి వారికి వచ్చేది అంతా ప్రాఫిట్స్ అనే చెప్పాలి. రానున్న రోజుల్లో ఈ మూవీ ఇంకెంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus