Geetu Royal: గలాటే గీతు స్ట్రాటజీ ఇదేనా..! కావాలనే గేమ్ ఆడుతోందా..!

యూట్యూబ్ నుంచీ మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ ఫేమస్ అయిన అమ్మాయి గలాటే గీతు. ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో అడుగుపెట్టింది. ఫస్ట్ డే నుంచే తన మార్క్ ని చూపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు కలబోసిన స్లాంగ్ లో మాట్లాడుతూ రెచ్చిపోతోంది. హౌస్ మేట్స్ కి చుక్కలు చూపిస్తోంది. ఫస్ట్ డే వాష్ రూమ్ లో జుట్టు లొల్లి అయితే, నెక్ట్స్ డే ఇనయా సుల్తానాతో ఒక ఆట ఆడుకుంది. ట్రాష్ టీమ్ నుంచీ నేరుగా బాలాదిత్యతో స్వాప్ అయి క్లాస్ టీమ్ కి వచ్చిన గీతూ హౌస్ మేట్స్ తో పనులు చేయించుకుంటూ రెచ్చిపోయింది.

ఇనయా సుల్తానాని టార్గెట్ చేసి మరీ పనులు చేయించుకుంది. దువ్వెన తీసుకురమ్మని, నిమ్మరసం తెమ్మని పనులు చెప్పింది. అంతేకాదు, పాటలు పాడు అంటూ ఆర్డర్ వేసింది. కానీ ఇనయా సుల్తానా నువ్వు పాడమంటే పాడటానికి నేను ఇక్కడికి రాలేదు అంటూ గట్టిగా సమాధానం చెప్పింది. ఇంట్లో పనులు చెప్తే చేస్తా కానీ, ఇలాంటివి నేను చేయను అని కౌంటర్ ఎటాక్ కి దిగింది. ఇద్దరిదీ టామ్ అండ్ జెర్రీ వార్ లాగా హౌస్ లో చాలాసేపు నడిచింది. దీంతో హౌస్ లో అందరూ గీతూ చేష్టలని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు.

అయితే, బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రం గీతూ కొద్దిగా అతి చేస్తోందని, గేమ్ ఆడటం బాగానే ఉన్నా, మాట్లాడే మాటలు బాలేదని అంటున్నారు. కొద్దిగా నోరు అదుపులో ఉంటే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, మరికొంతమంది బిగ్ బాస్ కి కంటెంట్ ఇవ్వాలంటే గీతులాగానే బిహేవ్ చేయాలని చెప్తున్నారు. గీతు లాంటి అమ్మాయి ఉంటేనే ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని, ఓపెన్ అయి గేమ్ బాగా ఆడుతోందని ఎప్రిషియేట్ చేస్తున్నారు. ఇంతకీ గీతు కంటెంట్ ఇస్తోందా లేదా స్ట్రాటజీ ప్లే చేస్తోందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరోవైపు బిగ్ బాస్ రివ్యూవర్స్ ఇద్దరూ కూడా క్లాస్ టీమ్ లో ఉండటంతో ఈవారం సేఫ్ జోన్ లో ఉన్నట్లుగానే అయ్యింది. బిగ్ బాస్ ఏదైనా భయంకరమైన ట్విస్ట్ ఇస్తేనే తప్ప, వీళ్లు నామినేషన్స్ లోకి రారు. అయితే, మాస్ టీమ్ నుంచీ మరికొంతమంది నామినేషన్స్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఏమైనా ఈవారం గలాటే గీతు నామినేషన్స్ లోకి రాకుండా సేఫ్ జోన్ లోనే ఉంది. తన యాసతో, గలగల మాట్లాడే స్వభావంతో హౌస్ లో రెచ్చిపోతోంది.

అంతేకాదు, ఏ టాస్క్ ఎలా ఆడాలి, ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి అనేది తోటి హౌస్ మేట్స్ కి సలహా కూడా ఇస్తోంది. మెల్లగా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న హౌస్ మేట్స్ నెక్ట్స్ వీక్ గీతుని నామినేట్ చేసి టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు గీతు కూడా హౌస్ లో తనకి నచ్చినట్లుగానే ఉంటానంటూ బల్లగుద్దీ మరీ చెప్తోంది. బహుశా ఇదే గీతురాయల్ స్ట్రాటజీ అవ్వొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus