గాలికిరీటిరెడ్డి సినిమా టైటిల్ ఫిక్స్.. వైరల్ అవుతున్న టైటిల్ పోస్టర్!

కన్నడ రాజకీయ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత గాలు జనార్దన్ రెడ్డి కుమారుడు గాలికిరీట్ రెడ్డి సినిమాలపై మక్కువతో సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన డెబ్యూ మూవీగా రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో జెనీలియా, శ్రీ లీల వంటి హీరోయిన్లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కొడుకును హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని గాలి జనార్దన్ రెడ్డి భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ అప్డేట్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే గాలి కిరీటిరెడ్డి నటిస్తున్నటువంటి ఈ చిత్రానికి జూనియర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈ టైటిల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

గాలి కిరీటి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ కు మంచి స్పందన రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కిరీటి రెడ్డికి నటనపై ఎంతో మక్కువ ఉండటంతో స్వయంగా తన తండ్రి తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. మరి కిరీటి రెడ్డి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus