2025 సంక్రాంతిని టార్గెట్ చేసి చాలా సినిమాలు రిలీజ్ అవుతాయని అధికారిక ప్రకటనలు వచ్చాయి. అయితే ఫైనల్ అయ్యింది మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) , శంకర్ (Shankar)..ల ‘గేమ్ ఛేంజర్'(Game Changer)… బాలకృష్ణ(Nandamuri Balakrishna)- బాబీ(Bobby) ..ల ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj), వెంకటేష్ (Venkatesh) – అనిల్ రావిపూడి (Anil Ravipudi)..ల ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam). ఈ మూడు సినిమాలు పండుగ బరిలో దిగనున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వీటిలో ఒక దానికి మరొకటి పోటీ అని చెప్పడానికి లేదు. డౌట్ లేకుండా రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ అన్నిటికంటే ముందుగా రిలీజ్ అవుతుంది కాబట్టి..
Game Changer
దానికి ఎక్కువ థియేటర్స్ వస్తాయి.. అలాగే రెండు రోజులు సోలో రిలీజ్ దక్కుతుంది. ఆ తర్వాత ‘డాకు మహారాజ్’ వస్తుంది. దానికి కూడా రెండు రోజులు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కంటే కొంచెం ఎక్కువ థియేటర్స్ దక్కుతాయి. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా చిన్నది అనడానికి లేదు. దానికి అనిల్ రావిపూడి డైరెక్టర్ కాబట్టి..మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా వీటి కంటెంట్ ఆడియన్స్ ని ఎంత వరకు ఎట్రాక్ట్ చేసింది అనేదానిపై తర్వాత థియేటర్ల షేరింగ్ వంటివి ఉంటాయి. రిలీజ్ ప్రకారం అయితే సేమ్ ఆర్డర్ .
సరే.. ఇక మూడు సినిమాల ట్రైలర్లు బయటకు వచ్చాయి. వాటిలో దేనికి ప్రేక్షకుల నుండి కొంచెం ఎక్కువ బెటర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అంటే.. కచ్చితంగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ట్రైలర్..కే అని చెప్పాలి. వాస్తవానికి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ కి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. కానీ ట్రైలర్ కట్ చాలా బాగుంది. దర్శకుడు శంకర్ మార్క్ కనిపించింది. నిర్మాత దిల్ రాజు పెట్టిన బడ్జెట్ కూడా అందులో కనిపించింది. ట్రైలర్ తర్వాత బయ్యర్స్ లో కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. దీని తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ ఆడియన్స్ కి బాగా నచ్చింది అని చెప్పాలి.
సంక్రాంతి ఫెస్టివల్ మూడ్ కి తగ్గట్టు.. ట్రైలర్ ను కట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కాకపోతే.. ప్రొడక్షన్ వాల్యూస్ అంత రిచ్ గా ఏమీ కనిపించలేదు. ఇక ‘డాకు మహారాజ్’ ట్రైలర్ ఎందుకో కొంచెం వెనుకబడింది. బహుశా కంటెంట్ రివీల్ కాకూడదు అని భావించి ట్రైలర్ ను అలా కట్ చేశారేమో. ఆ రకంగా ‘డాకు మహారాజ్’ ట్రైలర్ కంటే ‘గేమ్ ఛేంజర్’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్స్ కి యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. మరి వీటి థియేట్రికల్ రెస్పాన్స్ కూడా ఇదే ఆర్డర్లో ఉంటుందా? లేక మారుతుందా అనేది తెలియాల్సి ఉంది.