Game Changer: గేమ్ చేంజర్.. యూఎస్ లో ఈ టార్గెట్ సాధ్యమేనా?

టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో తమ క్రేజ్ పెంచుకోవడం కోసం పెద్ద స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు 10 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకోవడం టార్గెట్‌గా ముందుకు సాగుతున్నాయి. అందులో ప్రభాస్, అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్లు ఇప్పటికే ఈ లెక్కలు అందుకుంటున్నారు. అయితే, రామ్ చరణ్ (Ram Charan) కోసం ఇది ఇప్పటికీ ఒక ఛాలెంజ్‌గానే ఉంది.

Game Changer

‘ఆర్ఆర్ఆర్’  (RRR)  సినిమాతో అమెరికాలో రామ్ చరణ్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా ద్వారా ఆయన నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందాయి. కానీ సోలో హీరోగా ఇలాంటి రికార్డ్‌ను అందుకోవడం రామ్ చరణ్‌కు పెద్ద అబ్జెక్టివ్‌గా మారింది. ఆయన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer)  పై అందరి దృష్టి ఉంది. శంకర్  (Shankar) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండటంతో హైప్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్ 2’ (Bharateeyudu 2) సమస్యలు, ఫలితాలు ‘గేమ్ చేంజర్’ ప్రమోషన్‌కి మైనస్ అవుతున్నాయి. పుష్ప 2 (Pushpa 2: The Rule)  సినిమా ఇప్పుడు యూఎస్ మార్కెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. అల్లు అర్జున్ తన క్రేజ్‌ను అందుకు ఉపయోగించుకున్నాడు. రామ్ చరణ్ కూడా అదే క్రేజ్‌తో ‘గేమ్ చేంజర్’ను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.

డల్లాస్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్, ఇతర ప్రమోషన్లు ఈ సినిమా బజ్‌ను పెంచడానికి సహాయపడతాయని చిత్ర బృందం భావిస్తోంది. అయితే ఈ సినిమాకు ప్రస్తుత పరిస్థితుల్లో $10 మిలియన్ డాలర్ల టార్గెట్ చేరడం సాధ్యమా అన్న ప్రశ్న ఇంకా నమ్మశక్యం కాదు. ఆడియన్స్ నుంచి వచ్చే ఆదరణతో పాటు, యూఎస్‌లో రామ్ చరణ్ క్రేజ్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో ‘గేమ్ చేంజర్’ విడుదల తరువాత స్పష్టమవుతుంది.

సుకుమార్.. చరణ్ కంటే ముందు OTT సర్ ప్రైజ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus