మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘ఏజెంట్’ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ – బాపినీడు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్ , ట్రైలర్స్ లో యాక్షన్ ఎలిమెంట్స్ అలరించాయి. ఆగస్టు 25 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మొదటి నుండి ఈ సినిమా పై ఎటువంటి అంచనాలు లేవు.
కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ చిత్రం. అందుకే బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు అని తెలుస్తుంది. ఒకసారి థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 5.00 cr |
సీడెడ్ | 2.60 cr |
ఉత్తరాంధ్ర | 1.80 cr |
ఈస్ట్ | 1.10 cr |
వెస్ట్ | 0.70 cr |
గుంటూరు | 0.90 cr |
కృష్ణా | 1.20 cr |
నెల్లూరు | 0.50 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 13.80 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 15.80 cr (షేర్) |
‘గాండీవదారి అర్జున’ (Gandeevadhari Arjuna) చిత్రానికి రూ.15.8 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమా పై మినిమమ్ బజ్ కూడా లేదు. పాజిటివ్ టాక్ వస్తేనే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్