నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ అనే పక్కా మాస్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది.. లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా, శ్రీలీల.. బాలయ్యకి కూతురి పాత్రలో కనిపించబోతుంది. ఆల్రెడీ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. అక్టోబర్ 20 న ఈ చిత్రం దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
తాజాగా ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా (Bhagavanth Kesari) ‘భగవంత్ కేసరి’ చిత్రం నుండి ‘గణేష్ యాంతం’ అనే పాట రిలీజ్ అయ్యింది. మరో రెండు వారాల్లో వినాయక చవితి ఉత్సవాలు మొదలవుతాయి. దీంతో తమలోని ‘గణేష్ యాంతం’ పాటకి ప్రమోషన్ బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో తాజాగా ఆ పాటను విడుదల చేయడం జరిగింది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాట గణేష్ ఉత్సవాల్లో మార్మోగడం ఖాయంగా కనిపిస్తుంది.
కరీముల్లా, మనీష్ పండ్రం ఈ పాటని హుషారెత్తించే విధంగా పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో బాలయ్య, శ్రీలీల వేసిన ఎనర్జిటిక్ స్టెప్స్ ఈ పాటకి మరింత మైలేజీని తీసుకొచ్చే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. సినిమాలో ఈ పాట అభిమానులతో స్టెప్పులు వేయించే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా ఈ లిరికల్ సాంగ్ ని ఓ సారి చూస్తూ వినెయ్యండి :