గ్యాంగ్‌ లీడర్

  • September 13, 2019 / 02:17 PM IST

“జెర్సీ” లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అనంతరం నాని నటించగా విడుదలైన చిత్రం “గ్యాంగ్ లీడర్”. స్క్రీన్ ప్లే మాంత్రికుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కంటే పాటలు, ప్రోమోలు ఎక్కువగా ఆకట్టుకొన్నాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకొంది? నాని మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడా లేదా అనేడు చూద్దాం..!!

కథ: పాపులర్ ఇంగ్లీష్ సినిమాలు చూసి ఆ సినిమాలను తెలుగులో నవల్స్ గా ప్రచురించి ఫేమస్ లోకల్ రివెంజ్ రైటర్ అనే స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంటాడు పెన్సిల్ పార్ధసారధి (నాని). ఒక బ్యాంక్ దొంగతనంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులైన అయిదుగురు ఆడవాళ్ళు (లక్ష్మీ, శరణ్య, ప్రియాంక మోహన్, జైజ) వచ్చి తమ ఫ్యామిలీ మెంబర్స్ మర్డర్ కి కారకుడైన ఆరో దొంగను వెతికి అతడిపై రివెంజ్ తీర్చుకోవడం కోసం.. తమ గ్యాంగ్ లీడర్ గా పెన్సిల్ ను ఎంపిక చేసుకొంటారు.

ఈ రియల్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ తన నావల్ కి పనికొస్తుందనే భావనతో వాళ్ళ “గ్యాంగ్ లీడర్”గా ఉండడానికి ఒప్పుకొంటాడు పెన్సిల్. ఇండియాస్ మోస్ట్ పాపులర్ రేసర్ అయిన దేవ్ (కార్తికేయ)ను దొంగగా గుర్తిస్తారు ఈ పెన్సిల్ & గ్యాంగ్. ఆ తర్వాత అతడిపై రివెంజ్ ఎలా తీర్చుకున్నారు? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు: లేడీ గ్యాంగ్ లీడర్ పెన్సిల్ పార్ధసారధిగా తనకున్న ట్యాగ్ కి తగ్గట్లు.. సహజంగా ఆకట్టుకున్నాడు. అతని క్యారెక్టర్ సినిమాకి కామెడీని యాడ్ చేసింది. ఆ క్యారెక్టరే సినిమా మొత్తాన్ని మోసింది. ఇంకా చెప్పాలంటే టైటిల్ పాత్ర పోషించడంతోపాటు సినిమాను కూడా తన భుజాలపై వేసుకొని నడిపించాడు.

ప్రియాంక మోహన్ పద్ధతిగా, అందంగా కనిపించింది. పెర్ఫార్మెన్స్ కు పెద్దగా స్కోప్ లేకపోవడంతో.. ఆడియన్స్ ఆమె లుక్స్ టోన్ సంతృప్తి చెందారు. లక్ష్మి గారిని ఇకనైనా మన తెలుగు దర్శకులు మంచి పాత్రలు ఆఫర్ చేసి.. ఆమె టాలెంట్ ను సరిగా వినియోగించుకొంటారేమో. ఈ సినిమాకి ఆవిడ ప్రాణం, శరణ్య అమాయకురాలిగా ఆకట్టుకొంది. మరో అమ్మాయి, చిన్నారి కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతినాయక పాత్రలో కార్తికేయకు తన నటప్రతిభను చాటుకోవడానికి మంచి అవకాశం ఉన్నప్పటికీ.. పెద్దగా వినియోగించుకోలేదనే చెప్పాలి. అతడి ముఖంలో కోపం కనిపిస్తుందే తప్ప మరో భావం కనిపించలేదు.

సత్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ చక్కగా నవ్వించారు. ఈ సినిమాలో మంచి రిలీఫ్ వారి పాత్రలు.

సాంకేతికవర్గం పనితీరు: అనిరుద్ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఎప్పట్లానే అదరగొట్టాడు. “హొయ్ నా..” పాట చిత్రీకరణ సినిమా ప్లస్ పాయింట్స్ లో ఒకటి. మిరోస్లా కుబా బ్రోజెక్‌ కెమెరా వర్క్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఎప్పుడు వైవిధ్యమైన కథ-కథనాలతో ఆకట్టుకొనే విక్రమ్ కుమార్ మొదటిసారి ఒక కమర్షియల్ సినిమాతో ఆకట్టుకొందామని చేసిన ప్రయత్నం పెద్దగా అలరించలేకపోయింది. ఈ తరహా సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అందువల్ల “గ్యాంగ్ లీడర్” కొత్తగా ఉండదు. అలాగే కథనం ఆసక్తికరంగాను సాగదు. ఆ కారణంగా “గ్యాంగ్ లీడర్” చాలా చోట్ల బోర్ కొడుతుంది. కామెడీ కొన్ని చోట్ల సినిమాను, ఆడియన్స్ ను సేవ్ చేసినప్పటికీ.. విక్రమ్ లాంటి దర్శకుడి నుండి ఈ తరహా సినిమా మాత్రం ఎక్స్ పెక్ట్ చేయలేం.

విశ్లేషణ: ట్రైలర్ తోనే సగానికిపైగా అంచనాలను తగ్గించేసినప్పటికీ.. ఉన్న కాస్త అంచనాలను కూడా తగ్గించుకొని థియేటర్లకు వెళ్తే నాని మార్క్ కామెడీని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమాత్రం అంచనాలతో.. విక్రమ్ కుమార్ సినిమా కదా ఎదో స్క్రీన్ మ్యాజిక్ ఉండి తీరుతుంది అని ఉహించి థియేటర్ కి వెళ్తే మాత్రం నిరాశ చెందక తప్పదు.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus