బిగ్‌బాస్‌ 4: గంగవ్వ మాటలు.. భలే తూటాలు!

బిగ్‌బాస్‌ ఇంటి నుంచి గంగవ్వ బయటికొచ్చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుండటంతో గంగవ్వ బిగ్‌బాస్‌ బయటకు వెళ్లిపోయే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్‌. అందరి కన్నీళ్ల మధ్య, ఆశీర్వచనాలు ఇస్తూ బయటకు వచ్చిన గంగవ్వ… స్టేజీ మీద ఒక్కొక్కరి గురించి సరదా ముచ్చట్లు చెప్పింది. మరి గంగవ్వ ఎవరి గురించి ఏమందో చూద్దాం.

అప్పుడే నవ్వుతావు… అప్పుడే సీరియస్‌ అవుతావు అంటూ హారిక గురించి చెప్పింది గంగవ్వ. ఆ తర్వాత ఇద్దరూ బటర్‌ ఫ్లై కిస్‌ (ఫ్లయింగ్‌ కిస్‌) కూడా ఇచ్చుకున్నారు. దివి తన మనమరాలు లాంటిది అని చెప్పుకొచ్చింది గంగవ్వ. తనను సొంత అమ్మమ్మలా బాగా చూసుకుందని కూడా చెప్పింది. కష్టపడి నిద్రపోకుండా చూసుకుందదని కూడా చెప్పింది. ఇక కెప్టెన్‌ సోహైల్‌ను నాగుపాముతో పోల్చింది. కోపమొస్తే గొంతులో నరాలు తేలుతున్నాయి. కోపం తగ్గించుకో అని సూచించింది.

అఖిల్‌ గురించి చెబుతూ మంచిగ ఉంటడు అని అంది. బయటికొచ్చాక పెంపకానికి తీసుకుంటాను అని కూడా అంది. నువ్వు ఇంట్లో ఉంటే కళకళాడుతుంది అంటూ అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ను పొగిడేసిన గంగవ్వ… అతనిలో ఎలాంటి చెడు లేదని చెప్పింది. ఇక మోనాల్‌ గురించి చెబుతూ… చాలా మంచిది అని, తెలుగు నేర్చుకుందని, అమాయకమైన పిల్ల అంటూ పొగిడేసింది గంగవ్వ. బయటికొచ్చాక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని నోయల్‌కు సూచించింది.

నా పెద్ద బిడ్డతో కూర్చొని అన్నం తిన్నట్టు అనిపిస్తుంటుంది. నేను తినకపోతే బాధపడుతుంది అంటూ లాస్య గురించి చెప్పింది గంగవ్వ. నామినేషన్‌లో నువ్వే బయటికొస్తావ్‌ అంటూ సుజాతను ఏడిపించింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. అందరితో కలిస్తే బాగుంటుంది అంటూ అభిజీత్‌ను అంది. చిన్న పిల్ల అయినా మంచిది అంటూ ఆరియానా గురించి చెప్పింది. ఎవరైనా తనను పట్టించుకోకపోతే ముఖం మీదే అనేస్తుంది అంటూ ఆమె గురించి వివరించింది గంగవ్వ.

అవినాష్‌ను కుందేలుతో పోల్చింది గంగవ్వ. ఆటలు, పాటలు బాగా చేస్తాడు అంటూ మెచ్చుకుంది. మెహబూబ్‌ విషయంలో అంతా బాగానే ఉన్నా.. నోరు కాస్త అదుపులో ఉంటే మంచిది అంటూ వివరించింది. పడవ నామినేషన్‌ సమయంలో ఒకలా ఉన్నావ్‌… ఇప్పుడు మారావ్‌. నేర్చుకుంటున్నావ్‌. తొలి నాళ్లలో ఎవరితోనూ కలవలేదు. ఇప్పుడు అందరితో కలుస్తున్నావ్‌ అంటూ కుమార్‌ సాయి గురించి చెప్పింది.

గంగవ్వ ఇవన్నీ చెప్పాక… ఆమెకు నాగార్జున ఓ తీపి కబురు చెప్పాడు. ఆమె బిగ్‌బాస్‌ షోలోకి వచ్చిందే ఇల్లు కట్టుకోవడానికన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా గంగవ్వకు ఇల్లు కట్టిస్తాం అంటూ ప్రకటించాడు నాగార్జున. అంటే గంగవ్వ కోరిక నెరవేరినట్లే. అలా గంగవ్వ వెళ్లిపోతూ అఖిల్‌ను సేఫ్‌ చేసేసింది. అంతకుముందే సోహైల్‌ సేఫ్‌ అయ్యాడు.

Click Here -> గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!

Click Here -> ఇప్పటవరకూ ఎవరు చూడని గంగవ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus