‘టాస్క్‌’ గంగవ్వ వీరలెవల్‌ పర్‌ఫార్మెన్స్‌కి పురస్కారం

బిగ్‌బాస్‌లోకి గంగవ్వ వచ్చిన కొత్తలో ఆటంటే ఏంటో సరిగ్గా తెలియదు. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఈ కుర్ర యూత్‌తో ఎలా పోటీ పడుతుంది. టాస్క్‌లు ఎలా చేస్తుంది అని చాలామంది అనుకున్నారు. అందులో మీరూ ఉండే ఉంటారు. అయితే మొన్న ‘ఉక్కు హృదయం’ టాస్క్‌తో మొత్తం మాయమైపోయింది. కారణం అందులో గంగవ్వ పర్‌ఫార్మెన్స్‌. బయట గార్డెన్‌ ఏరియాలో నిద్రపోతున్న వారిని ఇంటిలోకి తీసుకురావాలనే ఆలోచనను అభిజీత్‌ చేయగానే…

ముందుగా బయటకు వెళ్లి మాట్లాడిన వ్యక్తి గంగవ్వ. ఈ విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు గంగవ్వ చేసిన పర్‌ఫార్మెన్స్‌కు ఈ రోజు మెడల్‌ వచ్చింది. టాస్క్‌లో అమాయకురాలిగా నటించి… అందరినీ ఇంట్లోకి తీసుకురావడానికి ఆమె చేసిన ప్రయత్నానికి కూడా బిగ్‌బాస్‌ ‘మహానటి’ మెడల్‌ ఇచ్చాడు. అంతేనా గంగవ్వ యాక్ట్‌ చేసిన మొత్తం స్లాట్‌ను మళ్లీ వేసి చూపించారు కూడా. ఇక స్మార్ట్‌ ప్లాన్‌ వేసిన అభిజీత్‌కు మహా నాయకుడు మెడల్‌ వచ్చింది.

అంటే టాస్క్‌ విషయంలో అభిజీత్‌ చేసింది కరెక్ట్‌ కాదని కొందరు అంటున్న మాటల్ని బిగ్‌బాస్‌ లెక్కలోకి తీసుకోలేదు. అంటే అభిజీత్‌ చేసింది కరెక్టే కదా. అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ను బోల్తా కొట్టించి ఛార్జింగ్‌ పెట్టుకున్న అవినాష్‌కు మహా కంత్రి మెడల్‌ ఇచ్చారు. అంతేకాకుండా నాగార్జున ‘మక’ అనే పేరు కూడా ఇచ్చారు. ‘మక’ అంటే మహా కంత్రి అని అర్థం.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus