Allu Arjun, Kavya: దేవుడా.. బన్నీ ఛాన్స్ ఇస్తానంటే ఆ ఆర్టిస్ట్ అలా చెప్పిందా?

అల్లు అర్జున్ హీరోగా రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో అదితి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన గంగోత్రి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతోనే బన్నీ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కావడంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. చిన్నికృష్ణ కథ అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో కావ్య నటించారు.

బాలనటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కావ్య మసూద అనే సినిమాతో సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మరో నటి సంగీతతో పాటు అలీతో సరదాగా షోకు హాజరయ్యారు. వీళ్లిద్దరూ హాజరైన ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అలీ కావ్యతో మాట్లాడుతూ ఈ కావ్య నాకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి పరిచయమని అన్నారు. అక్కడ కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ అని ఇక్కడ నేను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అని అలీ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత మసూద మూవీ హీరోయిన్ గా డెబ్యూ మూవీ అని కావ్య చెప్పుకొచ్చారు. మసూద అనే పదం ఉర్దూ పదం అని హర్రర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిందని కావ్య తెలిపారు. నేను లా చదివానని చైల్డ్ ఆర్టిస్ట్ గా 12 సినిమాలు చేశానని కావ్య పేర్కొన్నారు. రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందడి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని కావ్య చెప్పుకొచ్చారు.

నేను గంగోత్రి సినిమాలో నటించిన సమయంలో అల్లు అర్జున్ గారు హీరోయిన్ గా డేట్లు కావాలని అడిగారని అప్పుడు చిన్నదానిని కాబట్టి తెలియకపోవడంతో “నేను హీరోయిన్ అయ్యే సమయానికి మీరు ముసలోళ్లు అయిపోతారు” అని అన్నానని కావ్య వెల్లడించారు. ఒకవేళ ఇప్పుడు బన్నీ సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం కావ్య కచ్చితంగా నో చెప్పే అవకాశం అయితే లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus