Balakrishna, Jr NTR: బాలయ్య ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందా.. ఏం జరిగిందంటే?

నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తారకరత్న పెద్దకర్మలో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ను పలకరించలేదని చాలామంది తారక్ అభిమానులు ఫీల్ కావడంతో పాటు బాలయ్య లేదా తారక్ స్పందిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి హీరోలు ఎప్పుడూ కలిసే ఉండాలని ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. అయితే బాలయ్య సన్నిహితులు మాత్రం బాలయ్య, తారక్ మధ్య గ్యాప్ ఉన్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు.

చిన్నచిన్న మనస్పర్ధలు ఏ కుటుంబంలో అయినా సాధారణం అని వాటిని మరీ భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. నందమూరి హీరోలు మీడియా ముఖంగా తమ మధ్య మాటలు లేవని చెప్పలేదని కొంతమంది చెబుతున్నారు. తారకరత్న ఆస్పత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు బాలయ్య ప్రతిదీ చూసుకున్నారు. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ నటనను సైతం కొన్ని నెలల క్రితం ప్రశంసించారని ఫ్యాన్స్ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

అనవసరంగా బాలయ్యను టార్గెట్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఒకరి గురించి మరొకరు పలు సందర్భాల్లో పాజిటివ్ గానే కామెంట్లు చేస్తుండటం గమనార్హం. బాలయ్య తారక్ ప్రస్తుతం వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు బాలయ్య అంటే ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నారు.

ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల కుటుంబాలలో హీరోల మధ్య గ్యాప్ ఉందని తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ తమపై వస్తున్న కామెంట్ల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. బాలయ్య తారక్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus