Garikipati, Pushpa: పుష్ప వల్ల సమాజం చెడిపోతుందన్న గరికపాటి!

  • February 3, 2022 / 01:25 PM IST

2021 సంవత్సరంలో విడుదలైన సినిమాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదనే ప్రశ్నకు పుష్ప ది రైజ్ పేరు సమాధానంగా వినిపిస్తోంది. ఈ సినిమాలోని తగ్గేదేలే అనే డైలాగ్ ఏ స్థాయిలో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు సైతం ఈ డైలాగ్ చెబుతూ సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తుండగా ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలో బన్నీ గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించారు.

ఈ ఏడాది డిసెంబర్ నెలలో పుష్ప ది రూల్ రిలీజ్ కానుంది. అయితే పుష్ప సినిమాపై బన్నీ, సుకుమార్ లపై ప్రముఖ ప్రవచన కర్తలలో ఒకరైన గరికపాటి నరసింహారావు ఫైర్ అయ్యారు. తాజాగా గరికపాటి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన విషయం తెలిసిందే. గరికపాటి మాట్లాడుతూ మంచి కొరకు తగ్గేదేలే అనే డైలాగ్ ను వాడి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పుష్పలాంటి స్మగ్లర్ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పడం వల్ల సమాజం చెడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

శ్రీరాముడు, హరిశ్చంద్రుడు తగ్గేదేలే అంటే అర్థం ఉంటుందని పుష్ప లాంటి స్మగ్లర్ తగ్గేదేలే అని చెప్పడం వల్ల అరాచకం పెరిగిపోతుందని గరికపాటి కామెంట్లు చేశారు. ఇడియట్, రౌడీ పేర్లతో సినిమాలను తెరకెక్కించడం వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నామని ఆయన ప్రశ్నించారు. సమాజంలో మార్పు కొరకు తాను ప్రవచనాలను చెబుతున్నానని సినిమా క్లైమాక్స్ లో హీరోను మంచి వ్యక్తిగా చూపిస్తే సరిపోతుందా అంటూ గరికపాటి కామెంట్లు చేశారు. పుష్ప ది రైజ్ లో హీరోతో పనికిమాలిన పనులు చేయించడం వల్ల సెకండ్ పార్ట్ రిలీజయ్యేలోపు సమాజం చెడిపోదా అని గరికపాటి అన్నారు.

బన్నీ, సుకుమార్ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని వాళ్లను కడిగిపారేస్తానని ఆయన తెలిపారు. పుష్ప యూనిట్ నుంచి ఈ కామెంట్లపై ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి. బన్నీ అభిమానులు మాత్రం సినిమాను సినిమాలా చూడాలని కామెంట్లు చేస్తున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!


అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus