బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా హాల్ ఆఫ్ బాల్స్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టాడు. వీరసింహాలు, గర్జించేపులులు అంటూ పార్టిసిపెంట్ ఈ టాస్క్ ఆడుతూ బాల్స్ ని కాపాడుకుంటున్నారు. ఇందులోనే పవర్ బాక్స్ కోసం మద్యమద్యలో ఛాలెంజస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఛాలెంజ్ లో జంపింగ్ జపాంగ్ టాస్క్ లో తేజ – యావర్ ఇద్దరూ బెలూన్స్ గేమ్ లో విజయం సాధించారు.
అర్జున్ – ప్రశాంత్ ఎల్లో టీమ్ నుంచీ ఓడిపోయారు. దీనివల్ల పవర్ బాక్స్ ఆపోజిట్ టీమ్ కి వెళ్లింది. పవర్ బాక్స్ లో ఆపోజిట్ టీమ్ నుంచీ ఒకరిని తీసేయమని లెటర్ వచ్చింది. దీంతో గౌతమ్ అండ్ టీమ్ అందరూ కూడబలుక్కుని ప్రశాంత్ ని గేమ్ నుంచీ తప్పించారు. దీనికోసం గౌతమ్ రీజన్స్ చెప్పాడు. లాస్ట్ వీక్ టాస్క్ లో బాగా ఆడావ్ మళ్లీ నీకు ఆడే స్కోప్ వస్తుందని అన్నాడు. ఇక ఛాన్స్ దొరికింది కదా అని ప్రశాంత్ ఏడుస్తూ కూర్చున్నాడు.
ఫస్ట్ నుంచీ కూడా ఆడే ఛాన్స్ రాకపోతే ప్రశాంత్ ఏడుస్తునే ఉన్నాడు. ప్రశాంత్ కి డెడ్ బోర్డ్ వేసి ఆటలోనుంచీ తీసేసింది ఆపోజిట్ టీమ్. దీంతో ఎలాంటి స్ట్రాటజీలు చేకుండా, గేమ్ లో ఇన్వాల్ అవ్వకుండా ఒక చోట కూర్చుండి పోయాడు. ఇది చూసి భోలే కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు శివాజీ ప్రశాంత్ ని మోటివేట్ చేశాడు. ఇది జస్ట్ గేమ్ అని, మళ్లీ ఆడే ఛాన్స్ వస్తుందని కూడా చెప్పాడు. ఈ టాస్క్ తర్వాత బిగ్ బాస్ మరో ఛాలెంజ్ ని ఇచ్చాడు.
హ్యామర్ తో గ్లాస్ ని బ్రేక్ చేసి స్లోప్ పైన కరెక్ట్ గా రాడ్స్ ని పెట్టాల్సి ఉంటుంది. ఇందులో అర్జున్ – అమర్ ఎల్లో టీమ్ నుంచీ వచ్చి విజయం సాధించారు. తేజ-గౌతమ్ ఇద్దరూ ఓడిపోయారు. దీంతో పవర్ బాక్స్ ఈసారి ఆపోజిట్ టీమ్ అయిన ఎల్లోటీమ్ కి వచ్చింది. ఇందులో ఆపోజిట్ టీమ్ నుంచీ 500 బాల్స్ తీస్కోవచ్చు లేదా ఎవరినైనా కూడా ఆటలోనుంచీ డెడ్ చేయచ్చు.
అయితే శివాజీ అండ్ టీమ్ బాగా ఆలోచించి, 500 బాల్స్ ని తీస్కుంది. పార్టిసిపెంట్స్ ఈ టాస్క్ లో బాల్స్ దాచుకోవడానికి రకరకాల ప్లేస్ లని ఎంచుకున్నారు. బాల్కనీలో ఉన్న బీమ్ బ్యాగ్స్ లో సైతం బాల్స్ ని దాచారు. రతిక అయితే పిల్లలో వెనుక, సోఫాలో బాల్స్ ని పెట్టింది. ఇలా ప్రతి ఒక్కరూ తమ స్ట్రాటజీలతో గేమ్ ని ఆడుతున్నారు. మరి మూడో ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారు , (Bigg Boss 7 Telugu) ఈవారం కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.