Gautham Menon: ఏం మాయ చేసావే 2.. నాగచైతన్యతో సందడి చేయనున్న స్టార్ హీరోయిన్?

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఏం మాయ చేసావే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో సమంత మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడటంతో వీరీ పెళ్లి కూడా ఎంతో ఘనంగా జరిగింది.

ఇకపోతే సమంత నాగచైతన్య పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పాలి.ఇలా వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయి ప్రస్తుతం ఇద్దరు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఏ మాయ చేసావే సినిమా సూపర్ హిట్ కావడంతో గౌతమ్ మీనన్ ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా సీక్వెల్ గురించి ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గౌతమ్ మీనన్ క్లారిటీ ఇచ్చారు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇప్పటికీ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలియజేశారు.ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత స్థానంలో మరొక స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్లు సమాచారం. సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారు కనుక వీరిద్దరూ నటించే అవకాశాలు లేవు.

అందుకే గౌతమ్ ఈ సినిమాలో కూడా వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారని కథ సిద్ధం చేస్తూ సమంత స్థానంలో హీరోయిన్ రష్మికను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఏ మాయ చేసావే సీక్వెల్ సినిమాలో రష్మిక నటిస్తున్నారని తెలియడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులు కూడా ఆత్రుత కనబరుస్తున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus